ఆధునిక కాలంలో కూడా జాతకాలను నమ్మేవారున్నారు. అంతేకాదు రోజుని మొదలు పెట్టేముందు తమకు ఎలా ఉంది.. ఈ రోజు చేసే పనిలో విజయం అందుతుందా.. డబ్బులు వస్తాయా వంటి అనేక విషయాల్లోని మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. అయితే కొందరు తమ రాశి ఫలాలను నమ్మితే… మరి కొందరు తాము పుట్టిన తేదీని నమ్ముతారు. ఈ నేపథ్యంలో మీ పుట్టిన సంఖ్య ప్రకారం రోజువారీ అంచనా ఇక్కడ ఉంది. అయితే పుట్టిన సంఖ్యను ఎలా తెలుసుకోవాలి.. మీ పుట్టిన సంఖ్య ఆధారంగా ఆగస్టు 1వ తేదీ మంగళవారం సమాచారం ఏ తేదీన పుట్టిన వారికి ఏ విధంగా జరుగుతుందో ఈ రోజు తెలుసుకుందాం..
ఈ రోజు మీ స్వభావాన్ని విమర్శించే వారి సంఖ్య పెరగవచ్చు. మీ నిర్ణయం, బాధ్యతారాహిత్యం చిన్న వైఫల్యానికి కూడా కారణమని కొందరు ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఎవరు విమర్శ చేసినా వాటిని హృదయపూర్వకంగా తీసుకోకండి. అదే విధంగా గతంలో చేసిన పని, మీరు తీసుకున్న నిర్ణయాలు, మీ కృషి ఫలితంగా చరిష్మాఏర్పడుతుంది. ప్రతిదానికీ ప్రతిస్పందిస్తూ.. బిగ్గరగా సమాధానం ఇచ్చే విధానం నుంచి వీలైనంత వరకూ బయటపడడండి.
అందరినీ మెప్పించడం లేదా సంతోషపెట్టడం అసాధ్యం. వాస్తవికతను అంగీకరించడానికి సిద్ధంగా ఉండండి. అనుకోని వివాదంలో చిక్కుకుని చేతిలో డబ్బులు పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తుంటే గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. స్నేహితులు, బంధువులు సెకండ్ హ్యాండ్ స్కూటర్, బైక్ కొనుక్కోమని సలహా ఇస్తే లేదా మీకు ఆ ఆలోచన ఉంటే మీ మనస్సు నుండి తొలగించండి.
ఈ తేదీల్లో జన్మించిన వారి ఆలోచన, ప్రవర్తన, వ్యూహంలో మార్పు గురించి ఆలోచిస్తున్నారు. వీరి చేసిన పనులకు పొందుతున్న ప్రతిఫలం చాలా తక్కువ అని ఫీల్ అవుతారు. పబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్లు నడుపుతున్న వారికి ఆదాయం తగ్గుతుంది. మాంసం సంబంధిత వ్యాపారాలు, పరిశ్రమలకు చెందిన వారు ఏదో ఒక రూపంలో నష్టపోయే అవకాశం ఉంది.
ఆర్థిక సంక్షోభం తలెత్తవచ్చు. ఇంతకాలం మీ నిర్ణయాన్ని, మాటలను గౌరవించిన వారికి మునుపటిలా గౌరవం ఇవ్వడం లేదని గట్టిగా భావించడం మొదలుపెడతారు. ఇతరుల నుండి ఎక్కువగా ఆశించవద్దు. అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే రోగాల బారిన పడుతున్న వారు ఆ వ్యాధులతో మరింత ఎక్కువగా బాధపడే అవకాశం ఉంది. ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి ఆర్థిక సమస్యలు దూరమవుతాయి.
ఒక రకమైన శాంతి నెలకొంటుంది. మీరు అనుకున్నది చేసినా, మీరు చెప్పాలనుకున్నది చెప్పినా మీకు ఉపశమనం లభిస్తుంది. దూరపు బంధువులు మీకు కొత్త విషయాలు చెబుతారు. ఇది భవిష్యత్తులో ఏదో ఒక విధంగా మీకు సహాయం చేస్తుంది. ఈ రోజు మీరు అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దీని కోసం డబ్బు ఖర్చు చేస్తారు. సన్నిహితుల కుటుంబ అవసరాలకు సహాయం చేయనున్నారు. తండ్రితో అభిప్రాయ భేదాలు రావచ్చు.
జనన సంఖ్య 6 (ఏదైనా నెలలో 6, 15, 24 తేదీల్లో పుట్టిన వారికి పుట్టిన సంఖ్య 6)
ఈ తేదీల్లో పుట్టిన స్త్రీలు తమ భర్త ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. స్టడీ టూర్ వెళ్లే అవకాశం కూడా ఉంది. డెయిరీ వ్యాపారంలో ఉన్న వారికి కమీషన్ లేదా లాభాల మార్జిన్ పెంచుకునే అవకాశం ఉంది. ఈ రోజు వ్యాపారస్తులు తమ ప్రత్యర్థులతో మృదు మాటలతో వ్యవహరించాల్సి ఉంది.
మీరు సంపన్నులు కావచ్చు, మీకు విలువైన ఆస్తులు ఉండవచ్చు. ఈ రోజున చాలా ముఖ్యమైన హెచ్చరికను పాటించాలి. ఎందుకంటే మీకు దృష్టి లోపం వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెద్దల సలహాలను తీసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంది.
జనన సంఖ్య 8 (ఏదైనా నెలలో 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారికి పుట్టిన సంఖ్య 8)
ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు.. లేదా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు కొత్త కోర్సుని నేర్చుకోవాలని భావిస్తారు. స్టూడెంట్స్ సరైన మార్గ దర్శకత్వం తీసుకుని సరైన నిర్ణయం తీసుకోండి. బ్యాంక్ లోన్లకు దూరంగా ఉండండి. రక్త సంబంధిత వ్యక్తులు సమస్యలను ఎదుర్కోవచ్చు.
పుట్టిన సంఖ్య 9 (ఏదైనా నెలలో 9, 18, 27 తేదీల్లో పుట్టిన వారికి పుట్టిన సంఖ్య 9)
ఈ తేదీల్లో పుట్టిన వారికీ తమ సౌందర్యం పట్ల ఆసక్తిని ఎక్కువగా ఉంటుంది. బ్యూటీ పార్లర్ కు వెళ్లారు. అదే విధంగా షాపింగ్ చేసే అవకాశం ఉంది. ప్రేమికులు తమ భాగస్వామి కోసం అధిక ఖర్చులు చేయాల్సి వస్తుంది. క్రెడిట్ కార్డ్‌ని ఖర్చులను అదుపులో ఉంచుకోవాల్సి ఉంది. ఎంత ఖర్చు చేస్తున్నారు.. దేనికి ఖర్చు చేస్తున్నారో అంచనా వేయండి. లేకుంటే ఖర్చు మితిమీరుతుంది. అనవసరమైన అప్పులకు దూరంగా ఉండండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)