Vinayaka Chavithi in Hyderabad: హైదరాబాద్ లో వైభవంగా జరిగే ఉత్సవాలలో గణేష్ ఉత్సవాలు మొదటి వరుసలో ఉంటాయి. ప్రతి వాడ ప్రతి వీధి ప్రతి గల్లీ లో మండపాలు ఏర్పాటు, విగ్రహ ప్రతిష్ట జరుగుతుంటాయి. నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహించి ట్యాంకబండ్ లో నిమర్జనం చేయటం ఆనవాయితీ. ప్రతి ఏటా మంటపాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో విగ్రహాల ఏర్పాటు మునుపటికన్నా ఎక్కువగా ఉండకపోయినా సారి సమానం గా ఉండే అవకాశం ఉంది. దీంతో విగ్రహాల నిమజ్జనానికి అధిక సమయం పడుతోంది కొన్ని సంవత్సరాలుగా దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను కనుగొంటూనే ఉన్నారు. ఆటోమేటెడ్ హుక్ రిలీస్ సిస్టం లాంటి టెక్నిక్ ని వాడుతూ విగ్రహాల నిమజ్జనం వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా ఈసారి కూడా కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా తక్కువ సమయంలో ఇంకా ఎక్కువ విగ్రహాల నిమజ్జనం, కాంటాక్ట్ లెస్ నిమర్జనం అనే కాన్సెప్ట్ తో కొత్త విధానాన్ని తయారు చేస్తున్నారు. దీంతో నిమార్జనం సమయం మరింత తగ్గే అవకాశాన్ని ఉంటుంది. దీనికోసం ఆటోమేటెడ్ సిస్టర్ ని ఇన్వెంట్ చేసిన ఇంజినీర్ మురళీధర్ కాంటాక్ట్ లెస్ నిమజ్జనానికి అనువుగా క్రేన్ ప్లాట్ ఫాం లో కొన్ని మార్పులను చేశారు. దానికి సంబంధించిన డెమో సోమవారం ట్యాంక్ బండ్ పై నిర్వహించగా హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మరియు అడిషనల్ సిపి ఇతర అధికారులు డెమో నీ పర్యవేక్షించారు
ఒక బెలూన్ ని నీళ్లలో ముంచి నప్పుడు అది పైకి తేలుతుంది ఇదే లాజిక్ తో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే క్రేన్ కి కొన్ని ప్రత్యేకమైన ఏర్పాటు చేయడంతో నిమర్జనం వేగవంతమవుతుంది. ప్లాట్ ఫామ్ ఒకవైపున ధర్మకోల్ షీట్ లేదంటే ఎయిర్ టైట్ ప్లాస్టిక్ డ్రమ్స్ ని ఫిక్స్ చేస్తారు దీంతో నీళ్లల్లో ప్లాట్ ఫామ్ మునిగినప్పుడు డ్రమ్ లోని గాలి ఒత్తిడి వల్ల ఒకవైపు తేలుతూ ఇంకోవైపు ఒరిగిపోతుంది. దీంతో మనుషుల అవసరం లేకుండానే విగ్రహాలు నీళ్లలో జారిపడి మునిగిపోతాయి. వినటానికి ఇది సింపుల్ టెక్నిక్ ఐన దీని వెనక సైన్సు ఫార్ములా ఉంది. పెద్ద పెద్ద షిప్స్ నీళ్లలో మునగకుండా ఎలా ఉంటాయి అంటే వాటి తయారీలో లో కూడా ఈ టెక్నిక్ ని వాడతారు. సైన్స్ లో దీన్ని బోయన్సి టెక్నిక్ అంటారు. దీనితో ఇదివరకు ఒక నిమార్జనానికి 10 నిమిషాలు పట్టేది ఇప్పుడు కొన్ని సెకండ్స్ లో ఐపోతుంది. దీనితో సమయం ఆదా తో పాటు మనుషుల అవసరం లేకుండానే నిమార్జనం చేయొచ్చు. ఈ టెక్నిక్ ని వినాయక విగ్రహాల నిమజ్జనం లో ఉపయోగించే విధంగా ఇంజనీర్ మురళీధర్ తయారుచేశారు.
– SRAVAN.B, TV9 Telugu Hyderabad
Also Read: కాల్ కొట్టు.. గణేశుడి ప్రతిమ పట్టు.. హైదరాబాద్‌లో 70 వేల విగ్రహాల రూపకల్పన..