Srisailam: కరోనా ఎఫెక్ట్.. నేటి నుంచి శ్రీశైలం ఆలయంలో ఆంక్షలు..
కరోనా తీవ్రత దృష్ట్యా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయంలో నేటి (జనవరి17) నుంచి ఆంక్షలు విధించనున్నారు. స్వామివారి స్పర్శ దర్శనం, గర్భాలయ అభిషేకాలను
కరోనా తీవ్రత దృష్ట్యా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయంలో నేటి (జనవరి17) నుంచి ఆంక్షలు విధించనున్నారు. స్వామివారి స్పర్శ దర్శనం, గర్భాలయ అభిషేకాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. అదేవిధంగా అన్నప్రసాదం, వేదాశీర్వచనం, పాతాళగంగలో పుణ్యస్నానాలను కూడా నిలిపివేస్తున్నట్లు దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. కొవిడ్ నియంత్రణ చర్యలకు సంబంధించి ఆయన ఆదివారం దేవస్థానంలో ఆలయాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భక్తుల దర్శనాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భక్తులు కేవలం ఆన్ లైన్ లో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని కోరారు. కొవిడ్ ప్రభావం కారణంగా భక్తులకు ప్రస్తుతం లఘు దర్శనం మాత్రమే కలిపిస్తున్నారు. శఠారి, తీర్థం, ఉచిత ప్రసాదం పంపిణీని కూడా నిలిపివేస్తున్నామని పేర్కొన్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూ గంటకు కేవలం వెయ్యి మంది భక్తులకు మాత్రమే దర్శనం కల్పించనున్నామన్నారు.
రేపటి నుంచి వాటిని కూడా..
కాగా దేవస్థానంలో పరిమిత సంఖ్యలోనే ఆర్జిత సేవలు జరుగుతాయని ఈవో తెలిపారు. అందుబాటులో ఉన్న ఆర్జిత సేవల్లో ప్రస్తుతం జారీ చేస్తున్న టికెట్లలో 50 శాతం టికెట్లను మాత్రమే విక్రయించనున్నట్టుగా ఆయన వివరించారు. ఈ నెల 18 నుంచి ఆర్జిత సేవా టికెట్లను కూడా తాత్కాలికంగా నిలిపివేస్తామని ఈవో ప్రకటించారు. భక్తులు ఆన్ లైన్ దర్శనం టికెట్లను బుక్ చేసుకునే సమయంలో కరోనా వ్యాక్సినేషన్ వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఇక సామూహిక ఆర్జిత అభిషేకాలు రోజుకు నాలుగు విడుతలుగా నిర్వహించనున్నామన్నారు. ఒక్కో విడతలో 75 టికెట్లు జారీ చేస్తామన్నారు. వీరికి కేవలం స్వామివారి దర్శనం కల్పిస్తామన్నారు.
వారు ఆలయానికి రావద్దు..
కరోనా తీవ్రత నేపథ్యంలో వృద్దులు, గర్భిణీలు, బాలింతలు, పదేళ్ల లోపు వయసున్న పిల్లలు ఆలయానికి రావొద్దని ఈఓ కోరారు. జ్వరం, దగ్గు వంటి లక్షణాలున్న భక్తులను క్యూ లైన్లలో అనుమంతించబోమని ఈవో సూచించారు. క్యూ లైన్లలో ప్రవేశించే ముందు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహిస్తామన్నారు. ఇక దర్శనం తర్వాత భక్తులు శ్రీశైలంలో ఎక్కువ సమయం ఉండవద్దని లవన్న సూచించారు. పాతాళగంగలో స్నానాలతో పాటు రోప్‌వే, బోటింగ్ సేవలను సైతం నిలిపివేసినట్టుగా ఆయన పేర్కొన్నారు.
Also Read: ఈ మేకకు చికెన్ బిర్యానీ, మటన్ లేకుంటే ముద్ద దిగదు.. వీడియో
Bunny Vox: వయ్యారాల భామ బన్నీ వాక్స్.. అందాలతో అబ్బాయిలు క్లీన్ బౌల్డ్ అవ్వాల్సిందే
CM KCR: తెలంగాణలో పరిపాలనా సంస్కరణలు.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..