Colourful Shivling: ఈ ఆలయం నేటికీ సైన్స్ చేదించలేని మిస్టరీ.. రోజుకు మూడు రంగులు మారే శివయ్య.. అద్భుతం కనులారా చూడాల్సిందే..

భారత దేశం ఆధ్యాత్మిక ప్రదేశం. ఇక్కడ పురాతన, ప్రసిద్దిగాంచిన దేవాలయాలున్నాయి. ఎన్నో దేవాలయాలు రహస్యాలను దాచుకుని నేటికీ మానవ మేథస్సుకు సవాల్ ని విసురుతున్నాయి. అలాంటి మిస్టరీ ఆలయాల్లో శివాలయం ఒకటి. ఇక్కడ గర్భగుడిలో ఉన్న శివలింగం రోజుకు మూడుసార్లు రంగు మారుతుంది. ఇది చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు ఆలయాన్ని దర్శిస్తారు. చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతతో నిండిఈ ఈ ఆలయం ఎక్కడ ఉంది? రోజులే ఎప్పుడు శివయ్య రంగులు మార్చుకుంటాడో తెలుసుకుందాం..

Colourful Shivling: ఈ ఆలయం నేటికీ సైన్స్ చేదించలేని మిస్టరీ.. రోజుకు మూడు రంగులు మారే శివయ్య.. అద్భుతం కనులారా చూడాల్సిందే..
Colourful Shivling

Updated on: Jun 03, 2025 | 3:27 PM

భారతదేశం పురాతన సంస్కృతి, లెక్కలేనన్ని దేవాలయాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లాలో అటువంటి అద్భుతమైన, మర్మమైన ఆలయం ఉంది. దీనిని అచలేశ్వర మహాదేవ ఆలయం అని పిలుస్తారు. ఈ ఆలయం అత్యంత పురాతనమైన ఆలయం. అంతేకాదు ఇక్కడ గుడిలో ఉన్న అద్భుతమైన శివలింగం కారణంగా భక్తులు, పర్యాటకులు భారీ సంఖ్యలో ఆలయాన్ని దర్శించుకుంటారు. ఈ ఆలయంలోని శివలింగం వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే ఇక్కడ ఉన్న శివలింగం రోజులో మూడు సార్లు రంగును మార్చుకుంటుంది. ఇలా శివలింగం ఎందుకు రంగులు మార్చుకుంటుందో తెలుసుకునేందుకు శాస్త్రజ్ఞులు అనేక ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ ఇప్పటివరకు శాస్త్రవేత్తలు కూడా ఆ రహస్యాన్ని కనిపెట్టలేకపోయారు. అయితే ఇలా రంగులు మారడం శివుని మహిమ అని భక్తులు నమ్మకం.

రోజుకు మూడుసార్లు రంగు మారే శివలింగం

స్థానికులు, భక్తుల అభిప్రాయం ప్రకారం అచలేశ్వర మహాదేవ ఆలయంలో ఉన్న శివలింగం ఉదయం నుంచి సాయత్రం సమయం వరకూ మూడు వేర్వేరు రంగులలో కనిపిస్తుంది. ఉదయం శివలింగం ఎరుపు రంగులో భక్తులకు దర్శనం ఇస్తుంది. మధ్యాహ్నం శివలింగం కాషాయ రంగులోకి మారుతుంది… రోజు గడిచేకొద్దీ సాయంత్రం శివలింగం రంగు ముదురు రంగులోకి అంటే నలుపు రంగులోకి మారుతుంది. ఇలా శివుడు రంగులు చూసేందుకు ప్రజలు దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు.

శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు

శివలింగం రంగులను మార్చుకోవడంలో ఉన్న మర్మాన్ని తెలుసుకునేందుకు ఇప్పటికే శాస్త్రవేత్తలు, పరిశోధకులు అనేక ప్రయత్నాలు చేశారు. రోజులో ఎలా రంగులు స్వయంగా మార్చుకుంటుంది అనే విషయం తెలుసుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. అయితే ఇప్పటికీ దీనిని గల ఖచ్చితమైన శాస్త్రీయ కారణాన్ని కనుగొన లేదు. అయితే శివలింగంపై సూర్యకిరణాలు పడటం వల్ల ఇలా రంగులు మారుతూ ఉండవచ్చు అని కొంతమంది చెబుతున్నారు. అయితే ఇది పూర్తిగా నిరూపించబడలేదు.

ఇవి కూడా చదవండి

ఆలయ ప్రాముఖ్యత, చరిత్ర

అచలేశ్వర మహాదేవ ఆలయ చరిత్ర చాలా పురాతనమైనదని నమ్ముతారు. ఈ ఆలయం 2,500 సంవత్సరాలకు పైగా పురాతనమైనదని చరిత్రకారులు చెబుతున్నారు. ఆలయంలోని ప్రశాంతత , ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు అద్భుతమైన ప్రశాంతతను అనుభవిస్తారు. పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ ఆలయంలో అత్యంత వైభవంగా జరుగుతాయి.

భక్తుల అచంచల విశ్వాసం

స్థానిక ప్రజలు, దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఈ ఆలయంపై అచంచల విశ్వాసం కలిగి ఉన్నారు. అచలేశ్వర మహాదేవుడి కోరి కొలిస్తే చాలు భక్తులందరి కోరికలను నెరవేరుస్తారని నమ్ముతారు. ముఖ్యంగా సోమవారాల్లో భక్తులు శివుడుని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో చేరుకుంటారు. అచలేశ్వర మహాదేవ ఆలయం ఒక అద్భుతమైన ప్రదేశం. ఇది విశ్వాసం, రహస్యాల సంగమం.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు