Navaratri 2022: పండల్‌లో 1947 నుంచి ఇప్పటి వరకూ నాణేలు..కాయిన్ మ్యూజియంలో పూజలను అందుకుంటున్న అమ్మవారు

|

Sep 26, 2022 | 3:57 PM

దక్షిణ కోల్‌కతాలోని ఈ పూజా పండల్‌లో మా తుజే సలామ్ సాంగ్‌ థీమ్ సాంగ్‌గా ఉంది. ఈ పాట పూజ పాండల్‌లో ప్రతిధ్వనిస్తుంది. ఈ సాంగ్ తో దుర్గాదేవికి,  దేశానికి నివాళులర్పిస్తుంది. ఆదివారం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇక్కడ పండగను ప్రారంభించారు.

Navaratri 2022: పండల్‌లో 1947 నుంచి ఇప్పటి వరకూ నాణేలు..కాయిన్ మ్యూజియంలో పూజలను అందుకుంటున్న అమ్మవారు
Durga Puja Pandal
Follow us on

Navaratri 2022: దసరా మహోత్సవాలను దేశ వ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుపుకుంటారు. వీధి వీధిలో దుర్గాదేవిని కొలవడానికి మండపాలను ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా దసరా ఉత్సవాలు అంటే ముందుగా పశ్చిమ బెంగాల్‌ గుర్తుకొస్తుంది. కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన అనంతరం.. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఈ ఏడాది  దుర్గాపూజను ఘనంగా నిర్వహించనున్నారు. దీంతో కోల్‌కతాలోని పూజా పండళ్లు వేర్వేరు ఇతివృత్తాల్లో నిర్మిస్తున్నారు. కోల్‌కతాకు చెందిన బాబుబగన్ సర్బోజనిన్ దుర్గోత్సవ్ సమితి “గర్హి” అనే ప్రత్యేకమైన థీమ్‌తో మండపాన్ని నిర్మించింది. ఈ ఏడాది తమ పండల్ కు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు. 61 ఏళ్ల దక్షిణ కోల్‌కతా పూజా పండల్‌ను నాణేలతో అలంకరించారు.  దుర్గ అమ్మవారు  దుర్గ నాణేల మ్యూజియంలో కూర్చుని పూజలను అందుకుంటుంది.

దక్షిణ కోల్‌కతాలోని ఈ పూజా పండల్‌లో మా తుజే సలామ్ సాంగ్‌ థీమ్ సాంగ్‌గా ఉంది. ఈ పాట పూజ పాండల్‌లో ప్రతిధ్వనిస్తుంది. ఈ సాంగ్ తో దుర్గాదేవికి,  దేశానికి నివాళులర్పిస్తుంది. ఆదివారం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇక్కడ పండగను ప్రారంభించారు.

బాబూబాగన్ సర్బోజనిన్ దుర్గోత్సవ్ సమితి థీమ్ సూత్రధారి..  క్లబ్ కోశాధికారి సుజాతా గుప్తా మాట్లాడుతూ.. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ముఖ్యమైన సందర్భాల్లో అనేక స్మారక నాణేలను విడుదల చేస్తున్నారు. మేము అలాంటి నాణేలను సేకరించి వాటితో పండల్‌ను అలంకరించామని పేర్కొన్నారు. ఈ నాణేలలో కొన్ని అసలైనవి, మిగిలినవి ప్రతిరూపాలు. అమ్మవారి విగ్రహాన్ని నాణేల మ్యూజియంలో ఉంచుతామని తెలిపారు. కాయిన్ పార్క్ ఉంటుంది. తాము ఫైబర్ ,  ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన నాణేలను ముద్రించామని తెలిపారు. అసలు నాణేలు తన భర్త,  మామగారి నుంచి సేకరించామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

కళాకారుడు సనాతన్ పాల్ మట్టితో చేసిన దుర్గా దేవి విగ్రహాన్ని 16 అడుగుల వ్యాసంతో భారీ నాణేల ఆకృతిలో చెక్కినట్లు సుజాతా గుప్తా తెలిపారు. విగ్రహం 14 అడుగుల ఎత్తు ఉంటుంది.  ఈ విగ్రహం చూడడానికి ఒక ప్రత్యేక స్మారక నాణెం లా ఉంటుంది. కళ్యాణ్ సేన్ బరాత్ పూజ కోసం దేశభక్తి నేపథ్య సంగీతాన్ని సమకూర్చారు.

బాబుబగన్ పూజ సాధారణంగా బెంగాల్ సంస్కృతి, సంప్రదాయాలపై దృష్టి పెడుతుంది. 2018 సంవత్సరంలో  పండల్ టెర్రకోట ఆకారంలో , 2019లో అలంకరణ పాతచిత్ర ఆధారంగా రూపొందించబడింది. 2020లో పండల్ థీమ్‌ను ఆహారం, సంస్కృతి, సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  2021లో పునరుజ్జీవనోద్యమ ప్రదర్శన చేశామని పండల్ నిర్వాహకులు చెప్పారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..