చిదంబరం నటరాజ స్వామి ఆలయ సంపద లెక్కింపు కొనసాగుతోంది. దీక్షితుల సమక్షంలో మూడోరోజు లెక్కింపు ప్రక్రియ ముగిసింది. 2008వరకు స్వామి వారికి వచ్చిన నగలు, కానుకలకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించారు అధికారులు. ఐతే సంపద మొత్తం లెక్కింపుకు మరో వారం రోజులు పట్టే అవకాశముంది. ఎందుకంటే రోజుకు రెండేళ్లకు సంబంధించిన సంపద లెక్కింపు మాత్రమే పూర్తవుతోంది. ఈ లెక్కన 2022 వరకు మొత్తం సంపద వివరాలను సేకరించేందుకు మరిన్ని రోజులు పట్టనుంది. దీక్షితులు వర్సెస్ దేవాదాయ శాఖగా రెండు నెలలుగా కొనసాగిన ప్రతిష్టంభనకు ఫుల్‌స్టాప్ పడటంతో మూడ్రోజులుగా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.
1956 తర్వాత ఆలయ సంపద లెక్కింపు జరగడం ఇదే తొలిసారి..2005లో సంపద లెక్కింపు కోసం నాటి డిఎంకె ప్రభుత్వం ప్రయత్నించగా, ఆలయ బాధ్యతలు చూస్తున్న దీక్షితులు వర్గం కోర్టు ద్వారా నిలుపుదల చేసుకుంది..తాజాగా సంపద లెక్కింపు వ్యవహారాన్ని స్టాలిన్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఐతే సంపద లెక్కింపు కోసం వచ్చిన అధికారులను దీక్షితుల వర్గం అడ్డుకోవడంతో వివాదం మొదలైంది.
చివరకు దీక్షితులు వర్గం అంగీకరించడంతో ఆలయ సంపద వివరాలను సేకరిస్తున్నారు అధికారులు. ఐతే ఈ లెక్కింపు ప్రక్రియ..మరో వారం రోజులు పట్టే అవకాశముంది. దీంతో చిదంబరం నటరాజస్వామి సంపద ఎంత అన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు సంపద లెక్కింపు నేపథ్యంలో ఆలయం చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది స్టాలిన్ ప్రభుత్వం. నటరాజస్వామి సంపద వివరాలను దేవాదాయశాఖామంత్రి శేఖర్ బాబు సమక్షంలో మీడియాకు తెలిపే అవకాశముంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం