శంభో హరహర శంభో.. కణకణలాడే అగ్ని కణకాలపై నడిచి మొక్కులు చెల్లించుకున్న భక్తులు..!
సాధారణంగా కోరిన కోరికలు తీరిన తర్వాత దేవుళ్లకు కొబ్బరికాయ కొట్టడం, తలనీలాలు సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. కానీ ఈ ఆలయంలో మాత్రం కణకణలాడే నిప్పుల్లో నడిచి భక్తులు తమ మొక్కులను చెల్లించుకుంటారు. చిన్న, పెద్ద తేడా లేకుండా భక్తులు.. శివనామ స్మరణతో అగ్ని కీలలపై నడిచి భక్తిని చాటుకుంటున్నారు. ఈ ఆలయం ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

తెలంగాణ శ్రీశైల క్షేత్రంగా విరాజిల్లుతున్న నల్గొండ జిల్లా చెర్వుగట్టు శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా బుధవారం (జనవరి 28) తెల్లవారుజామున అగ్ని గుండాల కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా మాఘ మాసంలో శ్రీ పార్వతీసమేత జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. బ్రహ్మోత్సవాల్లో స్వామి వారి కళ్యాణం, అగ్ని గుండాల ఘట్టాలు ఎంతో ముఖ్యమైనవి.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం తెల్లవారుజామున అమ్మవారి సమేతంగా ఉన్న స్వామిని పర్వత వాహనంపై మంగళ వాద్యాల నడుమ ఆలయ పుర వీధుల్లో ఊరేగించారు. ఆలయం ఎదుట ఆలయ అర్చకులు మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. కణ కణలాడే నిప్పు కణకాలతో అగ్ని గుండాలను ఏర్పాటు చేశారు. అనంతరం వీరముష్టి వంశీయులతో మొదట పూజలు నిర్వహించి అగ్ని గుండాల కార్యక్రమం ప్రారంభించారు.
పంటలకు చీడపీడలు సోకకుండా పంటను స్వామికి సమర్పించి అగ్ని గుండాలపై నడిస్తే పంటలు బాగా పండి సుభిక్షంగా ఉంటామని భక్తుల నమ్మకం. ఏడాది పొడవున స్వామి వారి ఆశీస్సులు తమకు ఉంటాయని భక్తుల విశ్వాసం. దీంతో హరహర శంభో నామస్మరణలతో భక్తులు నిప్పుకనిలపై నడిచి తమ భక్తిని చాటుకున్నారు. శ్రీ జడల రామలింగేశ్వర స్వామి తమ ఇంటి ఇలవేల్పు అని, అగ్ని గుండాలపై నడిస్తే చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తులు చెబుతుంటారు. కోరిన కోరికలు తీరిన తర్వాత అగ్ని గుండాలపై నడిచి మొక్కులు తీర్చుకున్నామని భక్తులు చెబుతున్నారు. ప్రతి ఏటా మొక్కులు తీరిన తర్వాత అగ్ని గుండాలపై నడుస్తామని భక్తులు తెలిపారు. అగ్నిగుండాల కార్యక్రమంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
వీడియో ఇక్కడ చూడండి…
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..