Lunar Eclipse: 2025లో హోలీ రోజున మొదటి చంద్రగ్రహణం.. భారతదేశంలో గ్రహణ ప్రభావం ఉందా.. లేదా.. తెలుసుకోండి..

సంవత్సరంలో మొదటి చంద్ర గ్రహణం 2025 లో ఫాల్గుణ మాసంలో సంభవించబోతోంది. హిందూ మత గ్రంధాల ప్రకారం చంద్రగ్రహణం సమయంలో ఎటువంటి శుభకార్యాలు నిర్వహించరు. ఈ నేపధ్యంలో 2025 సంవత్సరంలో చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడనుంది.. ఆ సమయంలో ఎలాంటి కార్యకలాపాలు నిషేధించబడతాయో జ్యోతిష్యశాస్త్రం ప్రకారం తెలుసుకుందాం.

Lunar Eclipse: 2025లో హోలీ రోజున మొదటి చంద్రగ్రహణం.. భారతదేశంలో గ్రహణ ప్రభావం ఉందా.. లేదా.. తెలుసుకోండి..
Lunar Eclipse 2025

Updated on: Dec 16, 2024 | 2:36 PM

హిందూ మత గ్రంథాలలో చంద్ర గ్రహణం ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. నిజానికి చంద్రగ్రహణం అనేది ఒక ఖగోళ సంఘటన. చంద్రునికి , సూర్యుడుకి మధ్య భూమి వచ్చినప్పుడు ఈ దృగ్విషయం సంభవిస్తుంది. అంటే చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినపుడు..సూర్యుని కాంతి చంద్రునిపై పడదు. అప్పుడు భూమి మీద ఉన్నావారికి చంద్రుడు కనిపించడు. కనుక దీనిని చంద్ర గ్రహణం అని అంటారు. మరికొన్ని రోజుల్లో నూతన సంవత్సరం రాబోతోంది. అటువంటి పరిస్థితిలో జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం 2025 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఎప్పుడు సంభవిస్తుందో తెలుసుకుందాం.. అంతేకాదు జ్యోతిష్యం ప్రకారం ఈ గ్రహణం భారతదేశంపై ప్రభావం చూపుతుందా లేదా? లేదో తెలుసుకుందాం..

2025లో చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుందంటే

జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం 2025 సంవత్సరంలో ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున ఏర్పడనుంది. 2025 సంవత్సరంలో ఫాల్గుణ మాసం పౌర్ణమి తిధి మార్చి 14 న వచ్చింది. హోలీ పండగ కూడా ఈ రోజునే రావడం విశేషం. ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున కొత్త సంవత్సరంలో మొదటి చంద్ర గ్రహణం ఏర్పడనుంది. 2025 సంవత్సరంలో వచ్చే ఈ మొదటి చంద్ర గ్రహణం భారతదేశంలో కనిపించదు. ఈ కారణంగా ఈ చంద్రగ్రహణం సూత కాలం ఉండదు. గ్రహణం కనిపించినప్పుడే సూతకాలాన్ని పాటిస్తారు.

ఏఏ దేశాల్లో చంద్రగ్రహణం కనిపిస్తుందంటే

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం (విదేశాల్లోని కాలమానాన్ని అనుసరించి) మార్చి 14, 2025న ఉదయం 9:29 నుంచి మధ్యాహ్నం 3:29 వరకు చంద్రుడు గ్రహణం ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణం దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, ఆస్ట్రేలియా, అట్లాంటిక్ మహాసముద్రం, యూరప్, ఆసియాలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ ఉత్తర ధ్రువంలో కనిపిస్తుంది. అయితే ఈ గ్రహణం పగలు ఏర్పదనున్నందున భారతదేశంలో చంద్రగ్రహణం కనిపించదు. ఈ కారణంగా చంద్ర గ్రహణ సమయంలో సూతకం కాలం చెల్లదు.

ఇవి కూడా చదవండి

చంద్ర గ్రహణ సమయంలో ఈ నియమాలు పాటించండి..

  1. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం చంద్రగ్రహణం సమయంలో దేవుళ్లు, దేవతల విగ్రహాలను తాకవద్దు.
  2. ఈ కాలంలో పూజలు చేయకూడదు.
  3. ఈ సమయంలో మీకు ఇష్టమైన దేవుళ్ళను స్మరిస్తూ మంత్రాలను జపించండి.
  4. ఈ కాలంలో ఆహారాన్ని తయారు చేయవద్దు, దానిని తినవద్దు
  5. చంద్రగ్రహణం సమయంలో నిద్రపోకూడదు.
  6. పదునైన వస్తువులను ఉపయోగించకూడదు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.