2023 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం నేడు ఏర్పడనుంది. ఈరోజు రాత్రి ఏర్పడనున్న చంద్ర గ్రహణం భారతదేశంలో ప్రదర్శించబడనప్పటికీ. అయితే ఈరోజు వైశాఖ పూర్ణమి.. ఈ పున్నమిని బుద్ద పూర్ణిమగా జరుపుకుంటారు. ఈ రోజున ఏర్పడనున్న పెనుంబ్రల్ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించకపోయినా ప్రభావం ఉండనున్నదని జ్యోతిష్కులు చెబుతున్నారు.
అయితే, కొంతమంది ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం, ఈసారి చంద్రగ్రహణం యూరప్, ఆసియా, భారతీయ, పసిఫిక్ మహాసముద్రం, అంటార్కిటికా, అట్లాంటిక్, ఆస్ట్రేలియా, ఆఫ్రికాలోని చాలా ప్రాంతాలలో చూడవచ్చు. అయితే హిందూ క్యాలెండర్ ప్రకారం భారతదేశంలో చంద్రగ్రహణం కనిపించదు.
చంద్ర గ్రహణ సమయం, సూతక కాలం
భారతదేశం సమయం ప్రకారం.. ఈ సంవత్సరం తొలి చంద్రగ్రహణం ఈరోజు (శుక్రవారం) రాత్రి 8.44 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 1.01 గంటల వరకు కొనసాగుతుంది. అత్యధికంగా రాత్రి 10.52 గంటలకు గ్రహణం ఏర్పడుతుంది.
పెనుంబ్రల్ చంద్రగ్రహణం అంటే ఏమిటి?
ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడు.. చంద్రుని మధ్య భూమి చేరుకున్నప్పుడు, ఈ మూడు గ్రహాలు సరళ రేఖలో వస్తాయి. దీనినే చంద్రగ్రహణం అంటారు. ఈ సమయంలో చంద్రునిపై భూమి నీడ పడకపోతే.. ఈ దృగ్విషయాన్ని పెనుంబ్రల్ చంద్రగ్రహణం అంటారు.
సూతక కాలం సమయం ఎంత?
హిందూ మతంలో చంద్రగ్రహణం గురించి చాలా నమ్మకాలు ఉన్నాయి. ఇందులో సూతక కాలంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. పెనుంబ్రల్ చంద్ర గ్రహణాన్ని గ్రహణంగా పరిగణించరు. ఈ సందర్భంలో ఇందులో సూతక కాలానికి ప్రత్యేక ప్రాముఖ్యత లేదు. సమాచారం ప్రకారం చంద్రగ్రహణానికి 9 గంటల ముందు.. సూతక కాలంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో ఎటువంటి శుభ కార్యాలు, పూజలు కూడా చేయరాదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).