Chandra Grahan: ఈ రోజు సాయంత్రం చంద్రగ్రహణం .. పొరపాటున కూడా ఈ పనులు చేయకండి, భారీ నష్టం

|

May 05, 2023 | 10:28 AM

చంద్ర గ్రహణం చాలా అశుభకరమైన సంఘటనగా పరిగణించబడుతుంది. మానవుల జీవితాన్ని  ప్రభావితం చేస్తుంది. గ్రహణం సమయంలో.. కొన్ని పనులు చేయడం ద్వారా వ్యక్తి స్వయంగా ఇబ్బందులను తనకు తానే ఆహ్వానం పలుకుతాడని విశ్వాసం. అదే సమయంలో.. గ్రహణం దుష్ప్రభావాలను నివారించగల కొన్ని పనులు ఉన్నాయి.

Chandra Grahan: ఈ రోజు సాయంత్రం చంద్రగ్రహణం .. పొరపాటున కూడా ఈ పనులు చేయకండి, భారీ నష్టం
Chandra Grahan 2023
Follow us on

సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఈరోజు ఏర్పడనుంది. శాస్త్రీయ దృక్కోణంలో గ్రహణం కేవలం ఖగోళ దృగ్విషయం. అయితే హిందూ మతపరమైన దృక్కోణంలో.. గ్రహణానికి ప్రాముఖ్యత ఉంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం చంద్ర గ్రహణం చాలా అశుభకరమైన సంఘటనగా పరిగణించబడుతుంది. మానవుల జీవితాన్ని  ప్రభావితం చేస్తుంది. గ్రహణం సమయంలో.. కొన్ని పనులు చేయడం ద్వారా వ్యక్తి స్వయంగా ఇబ్బందులను తనకు తానే ఆహ్వానం పలుకుతాడని విశ్వాసం. అదే సమయంలో.. గ్రహణం దుష్ప్రభావాలను నివారించగల కొన్ని పనులు ఉన్నాయి. ఈ రోజు చంద్రగ్రహణం సమయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకుందాం.

చంద్రగ్రహణం నాడు ఏమి చేయాలంటే? 

  1. చంద్రగ్రహణం కారణంగా వాతావరణం కలుషితమవుతుందని నమ్ముతారు. దీని చెడు ప్రభావం మనుషులపై కూడా పడుతుంది. అటువంటి పరిస్థితిలో, గ్రహణం ముగిసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి. వీలైతే స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకోవాలి. ఇది మిమ్మల్ని శుభ్రపరుస్తుంది.
  2. గ్రహణం ముగిసిన తర్వాత ఇంటిని శుభ్రపరచుకోవాలి. ఇంట్లోని పూజా స్థలం దగ్గర, లోపల తప్పనిసరిగా గంగాజలం చల్లాలి. ఇలా చేయడం వలన ఇల్లు శుద్ధి అవుతుందని విశ్వాసం.
  3. ఇవి కూడా చదవండి
  4. హిందూ మత విశ్వాసం ప్రకారం.. గ్రహణం చెడు ప్రభావాలను నివారించడానికి ఆవుకు రొట్టె తినిపించండి. ఇలా చేయడం వల్ల స్థానికులకు శుభ ఫలితాలు లభిస్తాయని, చేసిన పాపాలు హరిస్తాయని నమ్ముతారు.

చంద్రగ్రహణం నాడు ఏమి చేయకూడదంటే?

  1. చంద్రగ్రహణం సమయంలో ఎటువంటి ఆహారం తినకూడదు. గ్రహణం కారణంగా ఉంచిన ఆహారం విషంలా మారుతుంది.. కనుక గ్రహణ సమయంలో వండిన ఆహారం తీసుకునే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు.
  2. గర్భం దాల్చిన స్త్రీలు గ్రహణ సమయంలో పొరపాటున కూడా ఇంటి నుంచి బయటకు రాకూడదు. ఇలా చేయడం వల్ల కడుపులో పుట్టిన బిడ్డకు చెడు ప్రభావం ఉంటుందని నమ్ముతారు. అంతే కాకుండా గ్రహణ సమయంలో గర్భిణులు కూడా నిద్రపోకూడదు.
  3. చంద్రగ్రహణం సమయంలో ఏ గుడికి వెళ్లకూడదు. ఇంట్లోని పూజ గదిలో పూజలు చేయకూడదు. గ్రహణ సమయంలో పూజ గది తలుపులు మూసి ఉంచండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).