Chanakya Niti: ఈ లక్షణాలున్న స్త్రీని భార్యగా పొందిన భర్త అదృష్టవంతుడట.. ఏ పనిలోనైనా విజయం తధ్యం..

ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మనుషుల జీవన శైలిని గురించి మాత్రమే కాదు.. మనుషుల బంధం నిలబడాలంటే ఏ విధమైన లక్షణాలు ఉండాలి కూడా పేర్కొన్నాడు. స్త్రీకి కొన్ని లక్షణాలు ఉంటే ఆ కుటుంబంలో మనుషుల మధ్య సామరస్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. ఈ సద్గుణాలున్న స్త్రీని భార్యగా స్వీకరించడం వల్ల భార్యాభర్తలు సంతోషంగా జీవిస్తారని చాణక్యుడు చెప్పాడు.

Chanakya Niti: ఈ లక్షణాలున్న స్త్రీని భార్యగా పొందిన భర్త అదృష్టవంతుడట.. ఏ పనిలోనైనా విజయం తధ్యం..
Chanakya

Updated on: Apr 28, 2025 | 9:29 PM

ఆచార్య చాణక్యుడు అని కూడా పిలువబడే చాణక్యుడు, చంద్రగుప్త మౌర్యుడిని రాజుగా రూపొందించడంలో కీలక పాత్ర పోషించాడు. తెలివి తేటలు, విధి విధానాలు కాలాతీత జ్ఞానాన్ని కలిగి ఉన్నాయని నమ్ముతారు. చాణక్యుడు రచించిన అతి పురాతన భారతీయ గ్రంథంలో ఒకటి చాణక్య నీతి. ఇందులో స్త్రీలోని ఈ ఐదు నిర్దిష్ట లక్షణాలు ఆ కుటుంబంలో అదృష్టాన్ని తెస్తాయి. ఆమె భర్తను అదృష్టవంతుడిగా మారుస్తాయి. ఈ నీతి శాస్త్రంలో స్త్రీ ప్రభావం పురుషుడి విజయానికి దోహదపడుతుందని.. ఆమె లక్షణాలు ఆమె భర్త ఆనందాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయని చెప్పబడింది. ఈ లక్షణాలు కుటుంబంలో సామరస్యపూర్వకమైన మరియు ఆనందకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. చాణక్య నీతి ప్రకారం స్త్రీకి ఈ ఐదు లక్షణాలు ఉంటే, ఆమె భర్త విజయం సాధిస్తాడు.

ఓర్పు: ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఓర్పు అనే గుణం ఉన్న స్త్రీని పొందిన భర్త అదృష్ట వంతుడు. తన భర్త సుఖదుఃఖాలలో అతనికి తోడుగా ఉంటుంది. ఓర్పు కష్టాలను అధిగమించడానికి సహాయపడుతుంది . దుఃఖం త్వరగా తీరుతుంది. అలాంటి ఓపికగల స్త్రీని తన భాగస్వామిగా పొందిన భర్త అదృష్ట వంతుడు. ఆమెని అదృష్ట సహచరురాలిగా భావిస్తారు.

భక్తి: ఆధ్యాత్మిక విలువలను పాటించే స్త్రీ తన భర్తకు అదృష్టవంతురాలిగా పరిగణించబడుతుంది. దేవుని పట్ల ఆమెకున్న విశ్వాసం, భక్తి ఆమెను తప్పుడు మార్గంలో వెళ్ళకుండా నిరోధిస్తూ.. భర్తను నడిపిస్తుంది. ఆధ్యాత్మికమైన దృక్పథం ఉన్న స్త్రీని భర్తగా పొందిన వ్యక్తి జీవితంలో శాంతి, విజయాన్ని పొందుతాడు.

ఇవి కూడా చదవండి

ప్రశాంతమైన స్వభావం: ప్రశాంతమైన ప్రవర్తన కలిగిన స్త్రీ తన కుటుంబంలో సానుకూల పరివర్తనలను తెస్తుంది. ఆమె ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని కొనసాగిస్తుంది. ఎటువంటి పరిస్థితి ఎదురైనా ప్రశాంతంగా నిర్వహించగలదు. అనవసరంగా కోపాన్ని వ్యక్తం చేయకుండా శాంతంగా ఉండే స్త్రీని భార్యగా పొందిన భర్త అదృష్ట వంతుడు. ఎందుకంటే మితిమీరిన కోపం హానికరం.

మధురమైన స్వరం: చాణక్యుడి ప్రకారం, మధురమైన, ఆహ్లాదకరమైన స్వరం కలిగిన స్త్రీ తన భర్తకు ఒక వరంలా పరిగణించబడుతుంది. ఆమె ఓదార్పునిచ్చే స్వరం.. ప్రేమపూర్వక సంభాషణ ఇంట్లో స్వర్గం లాంటి వాతావరణాన్ని సృష్టిస్తుంది.

నిగ్రహం: ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే తనని తాను నియంత్రణ చేసుకునే స్వభావమున్న స్త్రీని వివాహం చేసుకున్న భర్త జీవితంలో ఆనందం వికసిస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం.. కోపతాపాలను నివారించడం సామరస్యపూర్వక సంబంధానికి దోహదపడుతుంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు