Bhagavad Gita: మనసును కంట్రోల్ చేసుకుంటే బ్రతుకులో ఏ బాధలున్నా తట్టుకోగలుగుతాం
భగవద్గీత నుండి వచ్చిన ఉపదేశాలు మనం సరైన మార్గాన్ని ఎంచుకోవడానికి, మన కర్తవ్యాలను చేయడానికి, జీవితాన్ని పవిత్రంగా మార్చుకోవడానికి తోడ్పడతాయి. భగవద్గీత మన జీవన ప్రయాణంలో ధైర్యం, శాంతి, నమ్మకాన్ని పెంచుతుంది. భగవద్గీత జీవితం గురించి, జ్ఞానం గురించి లోతైన భావాలను చూపిస్తుంది.

భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ధర్మం, కర్మ, భక్తి, జ్ఞానం గురించి అమూల్యమైన సూచనలు ఇచ్చాడు. ఈ గ్రంథం మనకు సత్య మార్గాన్ని చూపుతుంది. మన ఆత్మసమతుల్యతను పెంచి, జీవితానికి నిజమైన అర్థాన్ని చూపిస్తుంది. ఇందులో చెప్పిన విషయాలు ప్రతి రోజు మనం ఎదుర్కొనే సమస్యలకు చక్కటి దారి చూపిస్తాయి.
భగవద్గీతలో ఒక గొప్ప ఉపదేశం ఉంది. మీ చర్యలపై మీకు హక్కు ఉంది.. ఫలాలపై కాదు. అంటే.. మన పని చేయడం మన బాధ్యత. ఫలితం ఎలా వస్తుందన్నది మన చేతుల్లో ఉండదు. కాబట్టి కేవలం కర్తవ్యం చేయాలి. ఫలితంపై ఆశ పెట్టుకోకూడదు.
శ్రీకృష్ణుడు యోగం గురించి చెబుతూ.. యోగం అనేది చర్యలో నైపుణ్యం. అంటే.. మనం చేసే పనిలో నైపుణ్యం పెంచుకోవడమే నిజమైన యోగం. పనిని నిబద్ధతతో, నైపుణ్యంతో చేయడం జీవితాన్ని పరిపూర్ణం చేస్తుంది.
ధర్మపోరాటం.. భగవద్గీతలో చెప్పినట్లు నిజమైన యోధులు ధర్మ పరిరక్షణ కోసం ధైర్యంగా పోరాడతారు. ధర్మాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి మౌలిక బాధ్యత.
భగవద్గీతలో మరో గొప్ప మాట ఉంది. కర్తవ్యం చేస్తూ ఫలితం గురించి ఆందోళన పడకూడదు. మన పని మనం మంచిగా చేస్తే ఫలితం తనంతట తానుగా వస్తుంది.
భగవద్గీతలో చెప్పబడింది. అహింస అనేది అత్యున్నత మతం. హింసను దూరంగా పెట్టి ప్రేమతో, శాంతితో ముందుకు సాగితే జీవితంలో నిజమైన విజయం సాధించవచ్చు.
శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు ఏ కర్మ చేస్తావో దాని ఫలితాన్ని అనుభవిస్తావు. దీని అర్థం మన కర్మలే మన భవిష్యత్తును నిర్దేశిస్తాయి. మనం మంచి పనులు చేస్తే మంచి ఫలితాలను పొందుతాము.
భగవద్గీతలోని ముఖ్యమైన ఉపదేశాలలో ఇది ఒకటి. నీవు కర్మ చేయుటకు మాత్రమే అర్హుడవు.. దాని ఫలితమును ఆశించుటకు నీకు అధికారము లేదు. దీని అర్థం.. పని చేయడం మన కర్తవ్యం. అయితే ఆ పనికి సంబంధించి ఫలితంపై మనకు హక్కు లేదు. నిజమైన ధర్మం నిస్వార్థంగా ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా పని చేయడంలోనే ఉంది.
భగవద్గీతలో చెప్పబడింది. మనిషికి గొప్ప యోగం తన మనస్సును నియంత్రించుకోవడం. మనస్సు నియంత్రణ చేత మనం జీవితంలోని బాధలను తట్టుకోగలుగుతాం. నిజమైన విజయానికి ఇది అత్యవసరం.
భగవద్గీతలో మరో గొప్ప ఉపదేశం ఉంది. తనను తాను తెలుసుకున్నవాడే నిజమైన జ్ఞాని. ఆత్మ జ్ఞానం ద్వారా మనం నిజమైన శాంతి పొందగలం.
శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇలా అంటాడు. భక్తి ద్వారానే మోక్షం లభిస్తుంది. దీని అర్థం నిజమైన ప్రేమ, నిష్కల్మషమైన భక్తితో పరమాత్ముని చేరుకోవడం ద్వారానే మన ఆత్మకు విముక్తి లభిస్తుంది.
భగవద్గీత నుండి వచ్చిన ఈ ఉపదేశాలు మన జీవితానికి వెలుగునిస్తాయి. మన కర్తవ్యాలను కచ్చితంగా చేయడానికి జీవన మార్గాన్ని పవిత్రం చేసుకోవడానికి మనకు బలాన్ని ఇస్తాయి. ఈ జ్ఞానం మన జీవితం మొత్తాన్ని మారుస్తుంది.




