Chanakya Niti: సంసారాన్ని బలంగా, ప్రశాంతంగా ఉంచే మహిళల ప్రత్యేక గుణాలు..!
ప్రాచీన కాలంలో భారతదేశంలో ప్రసిద్ధ పండితుడు, గొప్ప రాజకీయవేత్త, ఆర్థిక నిపుణుడిగా పేరుగాంచిన ఆచార్య చాణక్యుడు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందాడు. అతని సూత్రాలన్నింటినీ కలిపి ఒక పుస్తకంగా రూపొందించారు. దానినే చాణక్య నీతి అంటారు. ఇందులో జీవితంలో ప్రతి వ్యక్తి ఎదుర్కోవాల్సిన పరిస్థితులు, సమస్యల గురించి స్పష్టంగా వివరించారు.

చాణక్య నీతిలోని సమాచారం ప్రకారం కొంతమంది నిర్దిష్ట లక్షణాలు కలిగిన మహిళలను వివాహం చేసుకోవడం వల్ల పురుషుల వైవాహిక జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. పురుషుల వైవాహిక జీవితాన్ని ఇబ్బందికరంగా మార్చే మహిళల చెడు లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చాణక్యుని ప్రకారం మహిళలు ఎక్కువగా అబద్ధాలు చెప్పడం, ఇతరులను మోసం చేయడం వంటివి వారి జీవితాన్నే కాకుండా వారిని పెళ్లి చేసుకునే పురుషుల సంతోషాన్ని కూడా నాశనం చేస్తాయి.
చాణక్య నీతి ప్రకారం ఏ మహిళకైతే పెద్దవారిని అవమానించే అలవాటు ఉంటుందో వారి భర్త కూడా తీవ్ర అవమానాలను ఎదుర్కోవలసి వస్తుంది అని చాణక్యుడు హెచ్చరించాడు.
పెద్దలను గౌరవించని మహిళలు ఖచ్చితంగా తమ భర్తను కూడా గౌరవించరు. వీరి వల్ల ఇంట్లో శాంతి, సంతోషం ఉండవు. గొడవలు, చెడు మాటలు ఎక్కువగా ఉంటాయి. ఈ లక్షణం కలిగిన మహిళను వివాహం చేసుకునే పురుషుడు సంతోషంగా ఉండలేడు.
ఎక్కువ కోపం ఉన్న మహిళలు జీవితంలో చాలా సార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. వారిని వివాహం చేసుకునే పురుషులకు ఈ లక్షణం అనేక విధాలుగా దురదృష్టాన్ని కలిగిస్తుంది అని చాణక్యుడు పేర్కొన్నాడు.
ఎక్కువ కోపం ఉన్న మహిళలు తమను తాము సంతోషంగా ఉంచలేరు. ఇతరులను కూడా సంతోషంగా ఉంచలేరు.
చాణక్య నీతి ప్రకారం ఎక్కువ అత్యాశ కలిగిన మహిళల వైవాహిక జీవితం సంతోషంగా ఉండదు. వారు భర్త సంతోషాన్ని కూడా పాడుచేస్తారు.
ముఖ్యంగా డబ్బుపై అత్యాశ కలిగిన మహిళలు మొత్తం కుటుంబానికి హాని కలిగిస్తారని చాణక్యుడు పేర్కొన్నాడు. మహిళల్లో ఈ లక్షణాలు ఉంటే ముందుగా వాటిని మార్చుకోవాలి. ఎందుకంటే అది వారికి మాత్రమే కాకుండా ఇతరులకు కూడా ఎక్కువ హాని కలిగిస్తుంది.
(ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది)




