AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: చిన్న వయసులోనే సక్సెస్ అందుకోవాలా..! చాణక్యుడు చెప్పిన ఈ చిట్కాలు పాటించిచూడండి..

ప్రతి ఒక్కరూ చేపట్టిన పనిలో సక్సెస్ ను కోరుకుంటారు. మీరు కనుక చిన్న వయస్సులోనే విజయం సాధించాలనుకుంటే.. ఆచార్య చాణక్యుడు చెప్పిన కొన్ని విషయాలు గుర్తిమ్చుకోండి. మీ కెరీర్ మెరుగుపడుతుంది. ఆచార్య చాణుక్యుడు మెరుగైన జీవితాన్ని గడపడానికి అనేక పరిష్కారాలను తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. ఎవరైనా సరే విజయం కోసం చాణక్యుడు చూపిన మార్గాన్ని అనుసరిస్తే.. అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఎందుకంటే ఆచార్య చాణక్యుడు సమాజంలో మనిషి జీవితం, నడవడిక వంటి అనేక ప్రభావంతమైన చిట్కాలను చెప్పాడు.

Chanakya Niti: చిన్న వయసులోనే సక్సెస్ అందుకోవాలా..! చాణక్యుడు చెప్పిన ఈ చిట్కాలు పాటించిచూడండి..
Chanakya Niti
Surya Kala
|

Updated on: Oct 20, 2024 | 6:02 PM

Share

ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ జీవితంలో చాలా అభివృద్ధి చెందాలని సక్సెస్ తమ సొంతం కావాలని కోరుకుంటారు. చేపట్టిన పనిలో విజయం దక్కాలంటే ప్రతి చోటా కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే జీవితంలో విజయం సాధించడానికి మహానుభావులు అప్పుడప్పుడూ చెప్పిన అనేక సక్సెస్ సూత్రాలు ఉన్నాయి. ఎన్నో విభాగాల్లో ప్రావీణ్యం సంపాదించిన ఆచార్య చాణక్యుడు కూడా జీవితంలో విజయానికి సంబంధించిన చిట్కాలు కూడా చెప్పాడు. వీటిని అవలంబించడం ప్రారంభిస్తే జీవితంలో విజయం సాధించడం ప్రారంభమవుతుంది.

జీవితంలో విజయం సాధించడం ఎలా జీవితం విజయవంతం కావడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఆచార్య చాణక్యుడు ప్రకారం మొదటి నుంచి మీ మనస్సును నియంత్రించడం అలవాటు చేసుకుంటే.. జీవితంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. మనస్సును అదుపులో ఉంచుకుని పాండిత్యం సాధించిన వారు జీవితంలో చాలా ప్రయోజనాలను పొందుతారు. ఇటువంటి వారు సాధారణంగా చాలా సందర్భాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇలా సరైన నిర్ణయాలు తీసుకోవడం వలన తమ మనస్సును నియంత్రించుకునే వ్యక్తుల జీవితం సంతోషంగా, శాంతియుతంగా గడిచిపోతుంది. ఇటువంటి వారు ఇతరులకన్నా త్వరగా విజయం సాధిస్తారు.

మనస్సును అదుపులో ఉంచుకోలేకపోవడం వల్ల కలిగే నష్టాలు జీవించడం కూడా ఒక కళ. ఆర్ట్ ఆఫ్ లివింగ్ హిందువులలో మాత్రమే కాదు ప్రతి మతంలో చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడుతున్నాయి. మనసును అదుపులో పెట్టుకోలేకపోవడం జీవితంలో అనేక కష్టనష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎవరైనా సరే తమ జీవితం క్రమబద్ధంగా సాగాలనుకుంటే జీవితంలో కలిగే భ్రమల నుంచి బయటపడి ముందుకు సాగాలి. కోరికలను నియంత్రించుకునే వ్యక్తులు తమ సమయాన్ని, శక్తిని సరైన విషయాలలో ఖర్చు చేస్తాడు. విజయం సాధిస్తాడు. కోరికలను అదుపులో పెట్టుకోలేని వ్యక్తి నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. మనస్సును అదుపు చేసుకోలేని వ్యక్తులు జీవితంలోని చాలా పెద్ద సందర్భాలలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారని చాణక్య హెచ్చరిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

ఇతరుల కంటే ఎలా ముందుండాలంటే జీవితంలో సక్సెస్ సాధించాలంటే పోటీ చాలా ముఖ్యమైనది. ఇది సహజమైన విషయం. అటువంటి పరిస్థితిలో కొంతమంది జీవితంలో త్వరగా విజయం సాధించడాన్ని మీరు తప్పక చూసి ఉంటారు. కొంతమంది ఆర్ధిక ఇబ్బందులను తీర్చుకోవడానికి శక్తికి మించి కష్టపడడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ విషయంపై చాణక్యుడు ఈ రెండు రకాల వ్యక్తుల మధ్య వ్యత్యాసం.. మనస్సును నియంత్రించడంలో ఉంది. ఇంటి నుంచి మొదలు పాఠశాలలో చెప్పిన పాఠాలను సీరియస్‌గా తీసుకుంటే.. ఇతరులకన్నా త్వరగా సక్సెస్ ను అందుకోవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)