Chanakya Niti: ఆచార్య చాణక్యుడు(Acharya Chanakya) చాలా తెలివైన వ్యక్తి. కౌటిల్యుడు(Kautilyudu) చెప్పిన మాటలు, నీతులు నేటి కాలానికి అనుసరణీయం. వాటిని పాటించడం వలన ప్రస్తుత జనరేషన్ జీవితం సుఖ సంతోషాలతో సాగుతుందని పెద్దల నమ్మకం. సాధారణంగా వయసును చూసి పెద్దవాడో, చిన్నవాడో అని అంటారు. అయితే ఈ లాజిక్ ను ఆచార్య చాణక్యుడు అంగీకరించలేదు. చాణక్య నీతిలో పెద్దగా గుర్తింపు పొందాలంటే.. పెద్ద పనులు(Karmas) చేయాలని ప్రజలకు చెప్పారు. వాస్తవానికి, ఒక వ్యక్తి పనులే అతడిని పెద్దగా నిర్ణయిస్తాయి. పెద్ద పనులు చేయాలంటే అందుకు అనుగునంగా అవసరం అయితే పెద్ద త్యాగాలు చేయాల్సి ఉంటుంది. అటువంటి వాటికి భయపడకూడదు. ఒక వ్యక్తి తాను చేసే పనుల విషయంలో నిరంతరం శ్రద్ధ వహించాలి. మరణానంతరం, ప్రజలు మిమ్మల్ని మీ పనుల ద్వారా మాత్రమే గుర్తుంచుకుంటారు. అలాంటి వ్యక్తులు మరణం అనంతరం చాలా కాలం పాటు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తారు.
1. పర్వతం ఎంత పెద్దదైనా దానికి విలువ .. దానిలో ఉండే వాటిని బట్టి ఎలా వస్తుందో.. అదే విధంగా ఒక వ్యక్తి చేసే పనులు అతడిని పెద్దగా నిలబెడతాయి. అంతేకానీ అతడి వయసు ఆకారం బట్టికాదు అని ఆచార్య చాణుక్యుడు చెప్పారు.
2. మనిషి చేసే దాన ధర్మం, బలహీన వ్యక్తులకు చేసే సహాయం, ఇచ్చే విరాళాలు సంఘంలో గొప్ప వ్యక్తిగా నిలబెడతాయి. దాతృత్వం కారణంగానే కర్ణుడు, బలి ఈ రోజుకీ స్మరించబడుతున్నారని చెప్పాడు. దాతృత్వం ప్రాముఖ్యతను మీరు అర్థం చేసుకోవాలంటే, తేనెటీగలను చూడండి, అవి తమ కోసం తేనెను తయారు చేసుకుంటాయి, అవి తినవు, లేదా ఎవరినీ తీసుకోనివ్వవు, కానీ చివరికి ఆ తేనె మొత్తం ఎవరికో చెందుతుంది. అదేవిధంగా, తన కోసమే జీవించే వ్యక్తి, తాను సంతోషంగా ఉండలేడు, ఇతరులను సంతోషంగా ఉంచలేడు. చివరికి అతనే సర్వస్వం కోల్పోతాడు.
3. మంచితనం అనేది ఒక వ్యక్తి స్వభావంలో ఉంటుందని ఆచార్య చాణక్య విశ్వసించారు. ఒక వ్యక్తి మాటలు, ప్రవర్తన, ధైర్యం, సద్గుణాలు , దాతృత్వం వారి స్వంత యోగ్యతలను తెలియజేస్తాయి.
4. మోసగాడు భక్తిహీనుడైన రాజు వంటివాడు. తన స్వలాభం గురించి మాత్రమే ఆలోచించి మంచి చెడులను మరచి.. ప్రవర్తించే వాడు.. తనకు తాను హాని చేసుకుంటాడు.
Also Read: