Chanakya Niti: ఆత్మస్తుతి సహా మూడు అలవాట్లకు దూరంగా ఉంటే విజయం మీ సొంతమన్న చాణక్య

ఆచార్య చాణక్యుడు రచించిన నీతి శాస్త్రంలో రచించిన నీతి సూత్రాలను పాటిస్తే జీవితంలోని ఎన్నో సమస్యలను దూరం చేసుకోవచ్చని పెద్దలు చెబుతుంటారు. నేటికీ యువతకు నీతి శాస్త్రంలోని విషయాలు అనుసరణీయం అని చెబుతారు. చాణక్య నీతి ప్రకారం కొన్ని పనులు చేయడం తప్పు. ఈ మూడు అలవాట్ల వలన జీవితంలో ఇబ్బందులు కలుగుతాయి. అవి ఏమిటంటే..

Chanakya Niti: ఆత్మస్తుతి సహా మూడు అలవాట్లకు దూరంగా ఉంటే విజయం మీ సొంతమన్న చాణక్య
Chanakya Niti

Updated on: Jul 23, 2025 | 12:55 PM

కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు అని కూడా పిలువబడే ఆచార్య చాణక్యుడు.. చెప్పిన విధానాలు నేటికీ ప్రజలకు సరైన దిశానిర్దేశం చేస్తాయి. చాణక్య ‘చాణక్య నీతి’లో జీవితానికి సంబంధించిన అనేక విషయాలను చెప్పాడు, అవి నేటి కాలంలో కూడా అంతే సందర్భోచితంగా ఉంటాయి. అటువంటి విషయాల్లో ఒకటి మనిషికి ఉన్న ఈ మూడు అలవాట్లు వలన జీవితంలో అనేక ఇబ్బందులు కలుగుతాయి. అవి ఏమిటంటే..

మిమ్మల్ని మీరు ప్రశంసించుకోవడం అహం వైపు మొదటి అడుగు.
తనను తాను పొగుడుకొనే వ్యక్తి తనను తాను మోసం చేసుకుంటున్నాడని చాణక్యుడు చెబుతున్నాడు. ఆత్మస్తుతి ఇతరులపై చెడు ప్రభావాన్ని చూపడమే కాదు అది మీ వ్యక్తిత్వాన్ని కూడా బలహీనపరుస్తుంది. ఒక వ్యక్తి తనను తాను పదే పదే ప్రశంసించుకున్నప్పుడు.. అతనిలో అహంకారం పెరగడం ప్రారంభమవుతుంది. అప్పుడు అతను తన తప్పులను విస్మరించడం మొదలు పెడతాడు. చాణక్యుడి ప్రకారం గొప్ప వ్యక్తి అంటే ఇతరుల ముందు తనను తాను గొప్పగా చెప్పుకునే వ్యక్తి కాదు. ఇతరులతో గొప్పగా పిలవబడే వ్యక్తి మాత్రమే గొప్ప వ్యక్తి.

ఇతరులను విమర్శించడం
ఇతరులను విమర్శించడం లేదా ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం ప్రతికూల మనస్తత్వాన్ని సూచిస్తుంది. ఇతరుల గురించి వెనుకగా చెడుగా మాట్లాడటం ద్వారా.. ఆ వ్యక్తి తన విలువలను, వ్యక్తిత్వాన్ని కోల్పోతాడని చాణక్య చెప్పాడు. ఈ గుణం సమాజంలో ఉన్న మీరు పేరు ప్రతిష్టలను పాడు చేస్తుంది. ఇతరులలో తప్పులను మాత్రమే చూసే వ్యక్తి తనను తాను ఎప్పటికీ అభివృద్ధి చేసుకోలేడు. కనుక ప్రతి ఒక్కరికీ విమర్శించే బదులు.. మీలోని తప్పులను గుర్తించి వాటిని మెరుగుపరచుకోవాలని చాణక్య నీతి బోధిస్తుంది.

ఇవి కూడా చదవండి

ప్రదోష దర్శనం
ప్రదోష కాలంలో అంటే సాయంత్రం సమయంలో చెడు ఆలోచనలు, తప్పుడు సహవాసం లేదా అపవిత్ర ప్రదేశాలకు వెళ్లడం మానుకోవాలి. ప్రదోష దర్శనం వ్యక్తి శక్తిని ప్రతికూలంగా మారుస్తుందని చాణక్యుడు నమ్మాడు. ఇది స్వీయ-ఆత్మపరిశీలన, ధ్యానం లేదా భగవంతుని ఆరాధన కోసం కేటాయించబడిన సమయం. ఈ సమయంలో ఒక వ్యక్తి తప్పుడు ఆలోచనలు లేదా కార్యకలాపాలలో మునిగిపోతే.. అతని మానసిక, ఆధ్యాత్మిక సమతుల్యత క్షీణిస్తుంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.