Bonalu: లష్కర్ బోనాలకు సర్వం సిద్ధం .. ఆదివారం అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్న మంత్రి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేస్తూ వస్తుందని అన్నారు. ఆదివారం ఉదయం 4 గంటలకు అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు.

Bonalu: లష్కర్ బోనాలకు సర్వం సిద్ధం .. ఆదివారం అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్న మంత్రి
Lashkar Bonalu

Edited By:

Updated on: Jul 08, 2023 | 9:04 AM

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 9న జరిగే లష్కర్ బోనాలు సందర్భంగా ఏర్పాట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఆలయ పరిస ప్రాంతాలలో తిరుగుతూ ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేస్తూ వస్తుందని అన్నారు. ఆదివారం ఉదయం 4 గంటలకు అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా అన్ని జాగ్రత్తలు సక్రమంగా ఉన్నాయా అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..