Bhishma Niti: కష్టంలో ఉంటే ప్రతి ఒక్కరూ సలహా చెబుతారు.. ఆ మాటల వెనుక మర్మం అర్ధం చేసుకోమంటున్న భీష్మ..

మహాభారతంలో శాంతి పర్వంలో అంపశయ్య మీద ఉన్న బీష్ణుడు ధర్మరాజుకి తెలియజేసిన ఉపదేశాల గురించి ఉంటుంది. ఇందులో తృతీయాశ్వాసంలోని కథ నేటికీ అనుసరణీయం. ఈ కథలో అందరూ చెప్పే మాటలకు విలువ ఇవ్వవద్దని.. వారి మాటల వెనుక ఉన్న మర్మాన్ని పసిగట్టగలగాలి నీతి దాగుతుంది. అది ఏమిటంటే..

Bhishma Niti: కష్టంలో ఉంటే ప్రతి ఒక్కరూ సలహా చెబుతారు.. ఆ మాటల వెనుక మర్మం అర్ధం చేసుకోమంటున్న భీష్మ..
Bhishma Niti In Telugu

Updated on: Jun 06, 2025 | 3:01 PM

కోరున్నప్పుడు మరణించే వరం ఉన్న భీష్ముడు కురుక్షేత్రంలో పాండవులు, కౌరవుల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో అంపశయ్య మీద ఉన్నాడు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తున్న భీష్ముడు ఆ సమయంలో తన దగ్గరకు వచ్చిన పాండవులకు ధర్మోపదేశాన్ని చేశాడు. ధర్మరాజుకి రాజనీతిని గురించి రాజధర్మం, నడవడిక, మరియు ఆహారం వంటి అనేక సూక్ష్మాలు వివిధ కథల రూపంలో తెలియజేశాడు. అలా భీష్మపితామహుడు రాజనీతి గురించి ధర్మరాజుకి చేసిన ఉపదేశాలతో నిండిన శాంతిపర్వం మహాభారతంలోనే ఒక అరుదైన ఘట్టం. అందులోని తృతీయాశ్వాసంలోని కథ నేటికీ గొప్పదిగా పరగనింపబడుతుంది.

ఈ రోజు భీష్ముడు చెప్పిన మనుషుల మాటల వెనుక మర్మం కథ గురించి తెలుసుకుందాం..

పూర్వం విదిశాపట్నంలో ఒక బ్రాహ్మణు కుటుంబం ఉండేది. ఆ ఇంట్లో పిల్లవాడు అర్థంతరంగా మరణించాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్నకొడుకు మరణించడంతో బ్రాహ్మణ దంపతుల గుండె పగిలిపోయింది. కన్నీరు మున్నీరుగా విలపిస్తూనే ఆ భార్యాభర్తలు తమ కొడుకు శవాన్ని తీసుకుని స్మశానానికి చేరుకున్నారు. అయితే అక్కడ తమ చిన్నారి బాలుడిని వదిలి వచ్చెయ్యడానికి మనసు అంగీకరిచలేదు. దీంతో ఆ దేశం పక్కను కూర్చుని ఏడవడం మొదలు పెట్టారు అలా ఎంతసేపు ఏడ్చినా భార్యాభర్తలకు ఓదార్పు దక్కడం లేదు.

ఇవి కూడా చదవండి

అయితే ఇదంతా దూరంగా ఉన్న ఓ గద్ద గమనించింది. బాలుడి శవాన్ని చూడగానే దానికి ఆహరం దొరికింది అని భావించింది. నోరూరింది. అయితే ఆ బాలుడి తల్లిదండ్రులు శవాన్ని వదిలి వెళ్లితేనే తను శవాన్ని తినగలదు. అయితే శవాన్ని వదిలి ఎంతకూ వెళ్లడం లేదు.. చీకటిపడిపోతే గద్ద నేల మీద సంచరించడం కష్టం. ఆలోచించిన గద్ద మెల్లిగా దంపతుల దగ్గరకి చేరింది.. అయ్యా, ఎంతసేపని ఇలా ఏడుస్తూ కూర్చుంటారు? మరణించిన మీ కొడుకు రాదు కదా..! పైగా చీకటి పడే వేలాయింది, చీకటిపడితే భూతప్రేతాలన్నీ ఇక్కడకు చేరుకుంటాయి. కనుక శవాన్ని వదిలి వెంటనే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపొండి అని తొందర పెట్టింది.

ఓ నక్క అటువైపు వెళ్తూ గద్ద హడావిడిని చూసింది. దానికి కూడా శవం కనిపించింది. ఆహారం దొరికింది అంటూ దానిని నోరు ఊరింది. శవం కోసం కాచుకున్న గద్దని చేసి… ఎలాగినా సరే అక్కడ నుంచి గద్దని తప్పించి.. పిల్లాడి శవాన్ని రాత్రి వరకూ అక్కడే ఉంచగలితే రాత్రి తనే బాలుడి శవాన్ని తినొచ్చు అని భావించింది. అందుకనే పిల్లాడి తల్లిదండ్రులను సాయంత్రం వరకూ ఉంచేలా ఒప్పించాలనుకుంది. అందుకనే నిదానంగా బ్రాహ్మణుడి వద్దకు వచ్చిన నక్క.. ఓ బ్రహ్మణా ఈ పిల్లవాడిని వదిలివెళ్లడానికి మీకు మనసెలా ఒప్పుతోంది. కాసేపు వేచి చూడండి. ఎప్పుడేం జరుగుతుందో ఎవరు చెప్పగలరు. ఏ దేవతైనా కరుణించి మీ బిడ్డకు ప్రాణదానం చేయవచ్చు కదా అని అంది.

అయితే శవాన్ని తినేందుకు రెండు పోటీపడుతూ తల్లిదండ్రులను శవం దగ్గర నుంచి పంపించేందుకు గద్ద.. అక్కడే ఉంచేందుకు నక్క వాదనలు దిగాయి. గడ్డ మాట్లాడుతూ తాను వందల ఏళ్లుగా ఈ ప్రపంచాన్ని చూస్తున్నాను. ఇప్పటి పోయిన ప్రాణం తిరిగిరావడాన్ని ఎక్కడా చూడలేదు. ఆ నక్క మాటలు విని మీరు లేనిపోని ఆశలు పెంపుకుని భంగపడవద్దు,’ అంటూ హేచ్చరించింది. గడ్డ మాటలను విన్న భ్రహ్మన దంపతులు అక్కడ నుంచి బయలు దేరడానికి రెడీ అయ్యారు. అయితే గడ్డ మాటలకు బ్రాహ్మణ కుటుంబం బయల్దేరేలోగా.. నక్క మాట్లాడుతూ.. ఈ గద్ద మనసు మహా క్రూరమైంది. పూర్వం రాముడు ఒక బ్రాహ్మణుడిని బతికించిన కథ వినలేదా! సృంజయుడి కుమారుడైన సువర్ణష్టీవిని, నారదుడు బతికించలేదా! అలాగే ఏ దేవతో, యక్షుడో మీ కుమారుడిని కూడా బతికించవచ్చు కదా.. అంటూ నక్క వారు వెళ్ళకుండా అడ్డుకుంది.
అలా నక్క, గడ్డ బాలుడి శవం కోసం రకరకల్ పోటీలు పడ్డాయి. ఇంతలో రుద్రా భూమిలో విహారం చేస్తున్న శివుడు అక్కడకు చేరుకున్నాడు/

బ్రాహ్మణ కుటుంబపు దీనావస్థను చూసి జాలి పడిన శివయ్య మీకు ఏమి కావాలో కోరుకోమన్నాడు. దానికి ఆ భార్యాభర్తలు తమ బిడ్డను బతికించమని కోరుకున్నారు. దీంతో శివయ్య వారిని కోరికను తీర్చడంతో బాలుడు ప్రాణం పోసుకున్నాడు. అంతేకాదు గద్ద, నక్కలకు ఇలాంటి పాపాలు ఇక నుంచి చేసే అవసరం లేదంటూ వాటిని ఆకలి లేకుండా చిరకాలం జీవిస్తాయనే వరం ఇచ్చాడు.

ఈ కథ వలన నీతి ఏమిటంటే.. అందరూ తమ అవకాశాని అవసరాని దృష్టిలో పెట్టుకుని మాటలు చెబుతారు. అయితే ఇలా చెప్పే ప్రతిమాటా..మన మంచి కోసమే అని నమ్మకూడదు. కొంచెం లౌక్యాన్ని ప్రదర్శించాలి. కపటమైన వారు ఎదుటివారి కష్టాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. తియ్యటి మాటలతో తమ పథకాన్ని అమలుచేస్తుంటారు. కనుక ఎదుటివారి మాటల్లోని కపటాన్ని గ్రహించే నేర్పులు మనుషులకు ఉండాలి. వారి మాటల వెనుక ఉన్న మర్మాన్ని పసిగట్టగలగాలి.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు