Surya Bhagavan: సూర్య భగవానుడు ఈ విశ్వానికి ప్రాణదాత. ప్రతిరోజూ ప్రత్యక్ష దర్శనం ఇచ్చే సూర్యుడి వల్ల మాత్రమే భూమిపై జీవం ఉంది. సనాతన సంప్రదాయంలో సూర్యుడి ఆరాధన పుణ్యమైనదిగా భావిస్తారు. సూర్యుని కిరణాలను సైన్స్ కూడా ఆమోదించింది. ఎందుకంటే సూర్యుడు ప్రజలకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ప్రపంచానికి ఆత్మగా భావించే సూర్య భగవానుడి అనుగ్రహాన్ని పొందడానికి ఆదివారం ఉత్తమమైన రోజు. సూర్య భగవానుని ఆశీర్వాదాలు, ప్రయోజనాలను పొందడానికి ఏం చేయాలో తెలుసుకుందాం.
ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేయాలి. అనంతరం సూర్య భగవానుడికి మూడుసార్లు అర్ఘ్యం సమర్పించాలి. సూర్యుని స్తోత్రం లేదా సహస్రనామాన్ని భక్తితో పఠించాలి. ప్రతిరోజూ ఆదిత్య స్తోత్రాన్ని పఠించాలి. దీనిని పారాయణం చేయడం వల్ల సూర్యదేవుని అనుగ్రహం లభిస్తుంది. సూర్యభగవానుని విశేష ఆశీర్వాదం పొందడానికి ఆదివారం ఉపవాసం ఉండాలి. నూనె, ఉప్పు మొదలైనవి తినకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. సూర్యభగవానుని అనుగ్రహం పొందడానికి ప్రతిరోజూ శ్రీఖండం, గంధం లేదా రక్త చందనం తిలకం వేయాలి.
మీ జాతకంలో సూర్యుడు అశుభ ఫలితాలను ఇస్తున్నట్లయితే శుభ ఫలితాల కోసం మీ మెడలో రాగి నాణేన్ని ధరించాలి. ఎరుపు దారంతో మాత్రమే ధరించాలి. ఆదివారాల్లో గోధుమలు, రాగి, నెయ్యి, బంగారం, బెల్లం దానం చేయడం వల్ల సూర్యునికి సంబంధించిన అశుభాలు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుందని జ్యోతిష్యశాస్త్రంలో చెప్పారు. మీ కళ్ళు ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండాలన్నా, కంటికి సంబంధించిన వ్యాధులు త్వరగా తగ్గాలన్నా ప్రతిరోజూ సూర్యుని సాధన చేయండి. నేత్రవ్యాధులు రాకుండా రక్షించుకోవాలంటే రోజూ భక్తిశ్రద్ధలతో నేతోపనిషత్తు పారాయణం చేయాలి.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవని గుర్తించండి. సాధారణ పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని రాయడం జరిగింది.