స్నానం చేసిన తర్వాత ఈ తప్పులు చేశారో.. ఆరోగ్యపరంగా, ఆర్ధికంగా ఇబ్బంది తప్పవు..

వాస్తు శాస్త్రం ప్రకారం బాత్ రూమ్ కి స్నానం చేయడానికి కొన్ని నియమాలున్నాయి. స్నానం చేసిన తర్వాత బకెట్ లో నీటిని విడిచి పెట్టడం, బాత్రూంలో తడి బట్టలు విడిచి పెట్టడం వంటి అనేక విషయాలను పేర్కొంటూ.. అవి జీవితంలో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో తెలియజేస్తుంది. ఈ రోజు బాత్రూమ్‌కు సంబంధించిన వాస్తు శాస్త్రం నియమాలను గురించి తెలుసుకోండి.

స్నానం చేసిన తర్వాత ఈ తప్పులు చేశారో.. ఆరోగ్యపరంగా, ఆర్ధికంగా ఇబ్బంది తప్పవు..
Bathing Vastu Tips

Updated on: Sep 08, 2025 | 12:42 PM

స్నానం అనేది శరీరాన్ని శుభ్రపరిచే ప్రక్రియ మాత్రమే కాదు.. అలసటను తొలగించి మానసిక తాజాదనాన్ని పొందడానికి సులభమైన మార్గం. అయితే తరచుగా ప్రజలు స్నానం చేసిన తర్వాత కొన్ని చిన్న తప్పులు చేస్తారు. ఈ తప్పులు వారి ఆరోగ్యంపై మాత్రమే కాదు ఇంటిలోని శక్తి , వాస్తును కూడా ప్రభావితం చేస్తుంది. ఈ నేపధ్యంలో వాస్తు శాస్త్రం ప్రకారం స్నానం చేసిన తర్వాత ఏ తప్పులు చేయకూడదో ఈ రోజు తెలుసుకోండి

  1. స్నానం చేసిన తర్వాత బాత్రూంలోని బకెట్ లో కొంతమంది చివరగా నీటిని విడిచి పెడతారు. అయితే ఇలా నీటిని నిల్వ ఉంచడం అశుభం. ఈ చర్య రాహువు, కేతువు ఆగ్రహానికి కారణం అవుతుంది. అంతేకాదు ఇంట్లో పేదరికం ప్రబలుతుందని నమ్ముతారు. కనుక స్నానం చేసిన తర్వాత.. ఎల్లప్పుడూ బకెట్ శుభ్రం చేసి.. మురికి నీటిని పారబోసి.. మళ్ళీ మంచినీటితో నింపండి. ఎప్పుడూ ఖాళీ బకెట్ ని ఉంచవద్దు.
  2. స్నానం చేసిన తర్వాత రాలిన జుట్టును బాత్రూంలో వదిలేయడం వల్ల బాత్రూం మురికిగా మారుతుంది. అంతేకాదు ఇంట్లో ప్రతికూల శక్తిని కూడా ఆకర్షిస్తుంది. ఇలా చేయడం వల్ల శనీశ్వరుడు, కుజుడు అసంతృప్తి చెందుతారని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. కనుక స్నానం చేసిన ప్రతిసారీ బాత్రూమ్ ని శుభ్రంగా ఉంచుకోవాలి.
  3. చాలా మంది స్నానం చేసిన వెంటనే తడి బట్టలను బాత్రూంలో వదిలివేస్తారు. ఈ అలవాటు ఆరోగ్యానికి, వాస్తుకు హానికరం. తడి బట్టల్లో బ్యాక్టీరియా, ఫంగస్‌కు జన్మనిస్తాయి. కనుక తడి బట్టలను ఎండలో లేదా గాలిలో ఆరబెట్టడం మంచిది.
  4. వాస్తు శాస్త్రం ప్రకారం స్నానం చేసిన వెంటనే సింధూరం పెట్టుకోవడం సముచితంగా పరిగణించబడదు. స్నానం చేసిన తరవాత శరీరం, మనస్సు స్థిరపడటానికి సమయం పడుతుందని చెబుతారు. దీని కారణంగా తొందరపడి సిందూరం పెట్టుకోవడం వైవాహిక జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది
  5. ఇవి కూడా చదవండి
  6. స్నానం చేసేటప్పుడు కొంతమంది చెప్పులు ధరిస్తారు. ఇది వాస్తు శాస్త్రంలో నిషిద్ధంగా పరిగణించబడుతుంది. ఈ అలవాటు శారీరకంగా ప్రమాదకరమైనది మాత్రమే కాదు.. సానుకూల శక్తిని కూడా అడ్డుకుంటుంది. పరిశుభ్రత, భద్రత కోసం, చెప్పులు లేకుండా స్నానం చేయడం మంచిది.
  7. స్నానం చేసిన తర్వాత బాత్రూం తలుపు మూసి ఉంచడం వల్ల లోపల తేమ ఉంటుంది. దీనివల్ల ఫంగస్ , బూజు ఏర్పడుతుంది. ఈ తేమ గోడలకు హాని కలిగించడమే కాకుండా చర్మ, శ్వాసకోశ వ్యాధులకు కూడా కారణమవుతుంది.
  8. తడి పాదాలతో బయటకు రావడం వలన జారిపడే ప్రమాదం పెరగడమే కాకుండా పాదాలలో ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. కనుక స్నానం చేసిన తర్వాత పాదాలను పూర్తిగా తుడుచుకోవాలి.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు