Ugadi 2022: సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు.. కేసీఆర్ జాతకం గత సంవత్సరం కంటే బాగుంటుందన్న సంతోష్ కుమార్ శాస్త్రి..

|

Apr 02, 2022 | 1:27 PM

ఈ ఏడాది ముఖ్యమంత్రి కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయాలు ప్రకటిస్తారని బాచుపల్లి సంతోష్ కుమార శాస్త్రి తెలిపారు. శనివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకల్లో..

Ugadi 2022: సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు.. కేసీఆర్ జాతకం గత సంవత్సరం కంటే బాగుంటుందన్న సంతోష్ కుమార్ శాస్త్రి..
Bachupally Santosh Kumar Sh
Follow us on

ఈ ఏడాది ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) సాహసోపేతమైన నిర్ణయాలు ప్రకటిస్తారని బాచుపల్లి సంతోష్ కుమార శాస్త్రి(Bachupally Santosh Kumar Shastri) తెలిపారు. శనివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకల్లో   జరిగాయి. ఈ సందర్భంగా బాచుపల్లి సంతోష్ కుమార శాస్త్రి పంచాంగ పఠనం చేశారు. ఇది ఉద్యోగ నామ సంవత్సరమని 75 శాతం మంచి ఫలితాలు కనిపిస్తుండగా.. 25 శాతం వ్యతిరేకంగా ఉన్నట్లు తెలిపారు. క్రీడా, రాజకీయాలలో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. అన్ని చోట్లా మహిళలు కీలకంగా మారబోతున్నారని అన్నారు. ప్రజలు పొదుపు పాటించకపోతే శ్రీలంక పరిస్థితి వచ్చే అవకాశం ఉందన్నారు. తెలంగాణ ఐఏఎస్‌లలో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు.

ముఖ్య నేతలకు భద్రత పెరుగుతుందని, దేశంలో అలజడులు ఉంటాయని శాస్త్రి పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం ప్రపంచాన్ని శాసించే విధంగా ఎదుగుతుందని చెప్పుకొచ్చారు. రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ దూసుకెళ్తుందన్నారు. కొన్ని చోట్ల రైలు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు.

ప్రజలు పొదుపు పాటించకపోతే శ్రీలంక పరిస్థితి వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. కేసీఆర్ ది కర్కాటక రాశి అని.. సీఎం జాతకం గత సంవత్సరం కంటే బాగుంటుందని తెలిపారు. ప్రత్యర్ధులు ఇబ్బందులు పెట్టినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవని బాచుపల్లి సంతోష్ కుమార శాస్త్రి వెల్లడించారు.

ఇవి కూడా చదవండి: Diabetes Diet: మీకు డయాబెటిస్ ఉందా..? అయితే మీ ఆహారంలో ఈ పండును చేర్చుకోండి..

Skin Care Tips: వేసవి కాలంలో మెరిసిపోయే అందం మీ సొంతం కావాలంటే.. ఇంట్లోనే ఇలా చేయండి..