
బాబా వంగా.. ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు ఇది. 2026 సంవత్సరానికి సంబంధించిన ఆమె భవిష్యవాణి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆమె అంచనాల ప్రకారం, రాబోయే ఏడాది తీవ్రమైన మార్పులకు, సవాళ్లకు వేదిక కానుంది. బాబా వంగా, అసలు పేరు వంగేలియా పాండవ డిమిత్రోవా. 1911లో బల్గేరియాలో జన్మించారు. ఆమె చిన్న వయసులోనే కంటి చూపును కోల్పోయారు. ఆ తర్వాత భవిష్యవాణి చెప్పే అసాధారణ శక్తిని పొందారని చెబుతుంటారు. 1996లో ఆమె మరణించే ముందు.. ప్రిన్సెస్ డయానా మరణం, 2001 న్యూయార్క్ ట్విన్ టవర్స్ సంఘటన, ముంబై ఉగ్రవాద దాడులు, చైనా ఎదుగుదల, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం లాంటి అనేక కీలక సంఘటనలను ఆమె ముందుగానే అంచనా వేశారు. ఇందుకు గానూ ఆమెను ‘నోస్ట్రడమస్ ఆఫ్ ది బాల్కన్స్’ అని పిలుస్తారు. ఆమె చెప్పిన అనేక విషయాలు నిజం కావడంతో ఆమె భవిష్యవాణికి ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత ఏర్పడింది.
ఇది చదవండి: మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది.. 10 నిమిషాల్లోనే.!
1. తీవ్ర ఆర్థిక సంక్షోభం, బంగారం ధరల పెరుగుదల: 2026లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, బ్యాంక్ వైఫల్యాలు, అధిక ద్రవ్యోల్బణం సంభవించవచ్చని బాబా వంగా హెచ్చరించారు. ఈ అస్థిర పరిస్థితులలో బంగారం ధరలు ఊహించని విధంగా ఆకాశాన్ని తాకుతాయని, 25 నుంచి 40 శాతం వరకు పెరగవచ్చని ఆమె జోస్యం చెప్పారు. ఇప్పటికే పెరిగిన బంగారానికి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది.
2. భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలు: ఆమె భవిష్యవాణి ప్రకారం, 2026లో భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, తీవ్రమైన వాతావరణ మార్పులు సంభవించే అవకాశం ఉంది. ప్రపంచ భూభాగంలో సుమారు ఏడు నుంచి ఎనిమిది శాతం ఈ వైపరీత్యాల ప్రభావానికి లోనవుతుందని అంచనా.
3. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధిపత్యం: 2026 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయాలు, పరిశ్రమలు, మానవ జీవితాలపై ఆధిపత్యం చేసే స్థాయికి చేరుకుంటుందని ఆమె పేర్కొన్నారు. ఇది మానవ జీవితానికి అతిపెద్ద సవాలుగా మారవచ్చని, మానవ జీవితంలోకి లోతుగా చొచ్చుకుపోతుందని ఆమె హెచ్చరించారు. ప్రస్తుత AI వృద్ధిని చూస్తే ఆమె అంచనా నిజమేనని చాలా మంది భావిస్తున్నారు.
4. రష్యా నుంచి శక్తివంతమైన నాయకుడి ఆవిర్భావం: రష్యా నుంచి ప్రపంచ వ్యవహారాలను చూసుకునే శక్తివంతమైన నాయకుడు ఉద్భవిస్తాడని ఆమె అన్నారు.
5. చైనా ప్రాబల్యం, భౌగోళిక రాజకీయ మార్పులు: చైనా ప్రధాన ఆధిపత్యాన్ని పొందుతుందని, ఇందులో తైవాన్‌పై నియంత్రణ లేదా దక్షిణ చైనా సముద్రంలోకి విస్తరణ వంటివి ఉండవచ్చని బాబా వంగా పేర్కొన్నారు.
6. గ్రహాంతరవాసులతో పరిచయాలు: నవంబర్ 2026లో భూమి వాతావరణంలోకి ప్రవేశించే పెద్ద అంతరిక్ష నౌక ద్వారా మానవులు గ్రహాంతరవాసులతో సంబంధాలు ఏర్పరుచుకుంటారని ఆమె అంచనా వేశారు. ప్రత్యక్ష సంబంధాలు సాధ్యమవుతాయని తొలిసారిగా ఆమె సూచించడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
7. గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు: అనుశక్తి సమస్యల మధ్య ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు గ్రీన్ ఎనర్జీ, ఫ్యూషన్ రియాక్టర్ల వైపు వేగంగా అడుగులు వేస్తాయని బాబా వంగా తన భవిష్యవాణిలో పేర్కొన్నారు. ఇవి భవిష్యత్తులో మానవ అవసరాలను తీర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.
ఇది చదవండి: నన్నైతే అమ్మ, తమ్ముడు ముందే బట్టలు విప్పి చూపించమన్నారు.. టాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి