Ayodhya: క్రేన్ సాయంతో రామాలయ ప్రాంగణం నుంచి గర్భ గుడి వద్దకు చేరుకున్న రామ్ లల్లా .. కాసేపట్లో సంకల్పం

ఆలయ ప్రాంగణ లోకి బాల రామయ్య విగ్రహాన్ని తరలించే సమయంలో చేసే క్రతువులో ప్రధాన ఆచార్య పీఠం లక్ష్మీకాంత దీక్షితులు పాల్గొన్నారు. 16 స్తంభాలు 16 దేవుళ్లకు చిహ్నాలు అని చెప్పారు. మండపం నాలుగు ద్వారాలు నాలుగు వేదాలను సూచిస్తాయని.. అదేవిధంగా ప్రధాన ద్వారం వద్ద ఉన్న ఇద్దరు ద్వారపాలకులు నాలుగు వేదాలలోని రెండు శాఖలకు ప్రతినిధులని పేర్కొన్నారు. సుమారు 500  సంవత్సరాల పోరాటం తర్వాత శ్రీ రామ జన్మభూమికి విముక్తి లభించిందన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రామ మందిరంలోని గర్భ గుడిలో బాల రాముడు ఈ నెల  22న కొలువుదీరనున్నాడు.

Ayodhya: క్రేన్ సాయంతో రామాలయ ప్రాంగణం నుంచి గర్భ గుడి వద్దకు చేరుకున్న రామ్ లల్లా ..  కాసేపట్లో సంకల్పం
Lord Sri Ram Lalla
Follow us

|

Updated on: Jan 18, 2024 | 4:50 PM

అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామమందిరం గర్భగుడి వద్దకు రామ్ లల్లా చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో రామ్ లల్లా ప్రతిష్ట సందర్భంగా గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం క్రేన్ సాయంతో బాల రామయ్య విగ్రహాన్ని ఆలయంలోకి తీసుకుని వెళ్లనున్నారు. నేపాల్ లోని కాళీ నది నుంచి తీసుకొచ్చిన సాలిగ్రామ శిలతో  తయారు చేసిన 51 అంగుళాల విగ్రహాన్ని గుడిలోకి చేర్చిన అనంతరం ఆలయాన్ని శుద్ధి చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా ఆలయంలో స్వామివారికి  కుంకుమార్చన జరగనుంది.

రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టలో చేసే పవిత్ర కార్యక్రమంలో భాగంగా బుధవారం తెల్లవారుజామున స్థానిక మహిళలు మహా కలశ యాత్ర చేపట్టారు. ఆ తర్వాత పూజలు చేసి రామాలయ ప్రాంగణంలోకి రామ్ లల్లా విగ్రహాన్ని తీసుకుని వెళ్లారు. ఈ రామ్ లల్లా విగ్రహం దాదాపు 200 కిలోల బరువు ఉంటుందని చెబుతున్నారు. సమాచారం మేరకు విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకెళ్లే ముందు యాగ మండపంలోని 16 స్తంభాలు, నాలుగు ద్వారాలకు పూజలు చేశారు.

క్రేన్ తో ఆలయంలో లోపలి విగ్రహం తరలింపు

విగ్రహాన్ని ట్రక్కులో ఆలయానికి తీసుకువచ్చి క్రేన్‌తో పూజాకార్యక్రమాల అనంతరం ఆలయం లోపల ఉంచారు. ప్రతిష్ఠాపన కార్యక్రమం జనవరి 16న ప్రారంభమైంది.. జనవరి 22 వరకు కొనసాగుతుంది . ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రారంభోత్సవం కార్యక్రమానికి ముందు హిందూ సంప్రదాయాల ప్రకారం అనేక పూజాదికార్యక్రమాలు, అనేక ఆచారాలు నిర్వహించబడతాయి.

ఇవి కూడా చదవండి

బుధవారమే ఆలయ ప్రాంగణంలోకి చేరుకున్న రామ్ లల్లా విగ్రహం

ఆలయ ప్రాంగణ లోకి బాల రామయ్య విగ్రహాన్ని తరలించే సమయంలో చేసే క్రతువులో ప్రధాన ఆచార్య పీఠం లక్ష్మీకాంత దీక్షితులు పాల్గొన్నారు. 16 స్తంభాలు 16 దేవుళ్లకు చిహ్నాలు అని చెప్పారు. మండపం నాలుగు ద్వారాలు నాలుగు వేదాలను సూచిస్తాయని.. అదేవిధంగా ప్రధాన ద్వారం వద్ద ఉన్న ఇద్దరు ద్వారపాలకులు నాలుగు వేదాలలోని రెండు శాఖలకు ప్రతినిధులని పేర్కొన్నారు. సుమారు 500  సంవత్సరాల పోరాటం తర్వాత శ్రీ రామ జన్మభూమికి విముక్తి లభించిందన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రామ మందిరంలోని గర్భ గుడిలో బాల రాముడు ఈ నెల  22న కొలువుదీరనున్నాడు. దీంతో దేశవ్యాప్తంగా రామ నామ జపం వినిపిస్తోంది. ఉత్సాహ వాతావరణం నెలకొంది.

ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి

ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ , ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం నియమ నిబంధనల ప్రకారం నిర్వహించబడుతుంది. దేశ, విదేశాల నుంచి వేలాది మంది అతిథులు దీనిని తిలకించనున్నారు. మొదటి రోజు అంటే జనవరి 22న అందరినీ రాముడి గర్భగుడిలోకి అనుమతించనప్పటికీ, ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత భక్తు ల దర్శనం కోసం గర్భాలయం తెరవబడుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

స్నానం తర్వాత లేదా స్నానం ముందా? జుట్టుకు ఎప్పుడు నూనె రాయాలంటే
స్నానం తర్వాత లేదా స్నానం ముందా? జుట్టుకు ఎప్పుడు నూనె రాయాలంటే
బట్టలపై ఉండే బురద ఈజీగా పోవాలంటే.. ఈ చిట్కాలు ట్రై చేయండి..
బట్టలపై ఉండే బురద ఈజీగా పోవాలంటే.. ఈ చిట్కాలు ట్రై చేయండి..
పెట్టుబడిదారులపై బడ్జెట్ ఎఫెక్ట్..!
పెట్టుబడిదారులపై బడ్జెట్ ఎఫెక్ట్..!
ఈ జ్యోతిర్లింగ క్షేత్రంలో శివయ్యను పూజిస్తే చంద్ర దోష నివారణ..
ఈ జ్యోతిర్లింగ క్షేత్రంలో శివయ్యను పూజిస్తే చంద్ర దోష నివారణ..
డబ్బులిచ్చి పొగిడించుకుంటావ్‌.! జాన్వీ కపూర్ క్రేజీ ఆన్సర్.!
డబ్బులిచ్చి పొగిడించుకుంటావ్‌.! జాన్వీ కపూర్ క్రేజీ ఆన్సర్.!
ముఖంపై రక్తపు మరకలు..బ్యాండేజీ కట్టుకుని మరీ బౌలింగ్.. హ్యాట్సాఫ్
ముఖంపై రక్తపు మరకలు..బ్యాండేజీ కట్టుకుని మరీ బౌలింగ్.. హ్యాట్సాఫ్
మీ పొదుపు ఖాతాలో సొమ్ముకు ఎఫ్‌డీ వడ్డీరేటు కావాలా.. వెంటనే ఇలా..
మీ పొదుపు ఖాతాలో సొమ్ముకు ఎఫ్‌డీ వడ్డీరేటు కావాలా.. వెంటనే ఇలా..
తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడిగా భరత్ భూషణ్‌..
తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడిగా భరత్ భూషణ్‌..
మీ పేరులోని మొదటి అక్షరం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.?
మీ పేరులోని మొదటి అక్షరం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.?
మార్కెట్‌లోకి హీరో ఎక్స్‌ట్రీమ్ నయా వెర్షన్..ధరెంతో తెలిస్తే షాక్
మార్కెట్‌లోకి హీరో ఎక్స్‌ట్రీమ్ నయా వెర్షన్..ధరెంతో తెలిస్తే షాక్
ప్రధాని మోదీపై కామత్ ప్రశంసలు.. నేర్చుకోవాల్సింది చాలానే ఉందంటూ..
ప్రధాని మోదీపై కామత్ ప్రశంసలు.. నేర్చుకోవాల్సింది చాలానే ఉందంటూ..
తేజు చేసిన సాయానికి కన్నీళ్లతో ధన్యవాదాలు చెప్పిన సీనియర్ నటి.!
తేజు చేసిన సాయానికి కన్నీళ్లతో ధన్యవాదాలు చెప్పిన సీనియర్ నటి.!
ప్రధాని మోదీపై రణబీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?
ప్రధాని మోదీపై రణబీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?
నెలకు రూ.4.5 లక్షల ఫుడ్ ఫ్రీ ఫుడ్ సప్లయ్! టాలీవుడ్ హీరో మంచి మనసు
నెలకు రూ.4.5 లక్షల ఫుడ్ ఫ్రీ ఫుడ్ సప్లయ్! టాలీవుడ్ హీరో మంచి మనసు
లైగర్ అప్పుల నుంచి ఎట్టకేలకు పూరీకి విముక్తి.!
లైగర్ అప్పుల నుంచి ఎట్టకేలకు పూరీకి విముక్తి.!
ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం.! నారా లోకేష్ క్లారిటీ
ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం.! నారా లోకేష్ క్లారిటీ
విజయ్‌ దేవరకొండ సినిమాను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిన రష్మిక.!
విజయ్‌ దేవరకొండ సినిమాను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిన రష్మిక.!
తాగిన మైకంలో పాముతో ఆటలు.. కాటేసిన సర్పం.! తర్వాత ఏమైందంటే..!
తాగిన మైకంలో పాముతో ఆటలు.. కాటేసిన సర్పం.! తర్వాత ఏమైందంటే..!
స్క్రీన్ షాట్స్ తో సహా నటుడి నీచపు గుట్టును బటయపెట్టిన సింగర్.?
స్క్రీన్ షాట్స్ తో సహా నటుడి నీచపు గుట్టును బటయపెట్టిన సింగర్.?
తగ్గిన బంగారం ధరలు ఎన్నాళ్లు ఇలాగే ఉంటాయి.? నిపుణుల మాటేంటి.!
తగ్గిన బంగారం ధరలు ఎన్నాళ్లు ఇలాగే ఉంటాయి.? నిపుణుల మాటేంటి.!