
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎప్పుడుపడితే అప్పుడు జుట్టు కత్తిరించుకోవడం లేదా గడ్డం గీసుకోవడం మంచిది కాదు. గోర్లు, జుట్టు కత్తిరించడం వంటి రోజువారీ కార్యకలాపాలకు శుభ, అశుభ దినాలు ఉన్నాయి. చాలా మంది పురుషులు శుభ, అశుభ దినాలను పరిగణనలోకి తీసుకోకుండా క్షవరం చేసుకుంటారు. మత విశ్వాసాలు సోమవారం గడ్డం కత్తిరించుకోవడం అశుభమని చెబుతారు. సోమవారం శివుడికి అంకితం చేయబడిన రోజు. ఈ రోజున జుట్టు కత్తిరించడం వల్ల మానసిక క్షోభ కలుగుతుందని చెబుతారు. సోమవారం జుట్టు కత్తిరించడం వల్ల అకాల మరణం సంభవిస్తుందని మత విశ్వాసం కూడా ఉంది. శివుని భక్తుడు లేదా తన కొడుకు సంక్షేమం కోరుకునే వ్యక్తి సోమవారం తన జుట్టు లేదా గడ్డం కత్తిరించుకోకూడదని చెబుతారు.
ప్రముఖ సాధువు ప్రేమానంద మహారాజ్ ప్రకారం.. సోమవారం నాడు జుట్టు లేదా గడ్డం కత్తిరించకూడదు. సోమవారం జుట్టు కత్తిరించడం వల్ల జాతకంలో చంద్రుని స్థానం బలహీనపడుతుందని, ఇది మానసిక అనారోగ్యానికి దారితీస్తుందని ఆయన అన్నారు. మంగళ, శనివారాల్లో జుట్టు కత్తిరించుకోవడం లేదా గడ్డం గీసుకోవడం కూడా మంచిది కాదు. కాబట్టి, బుధ, శుక్రవారాల్లో మీ జుట్టు, గోళ్లను కత్తిరించుకోవడానికి కేటాయించండి. ఈ రెండు రోజులు శుభప్రదంగా భావిస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి