Dog Astrology: కుక్క విశ్వాసం గల జంతువే.. ఇంట్లో కుక్కని పెంచుకుంటే ఏ గ్రహాలు బలపడతాయో తెలుసా..

మనిషికి అత్యంత విశ్వాస జంతువు. కొంతమంది తమ పిల్లలతో సమానంగా కుక్కలను పెంచుకుంటారు. కుక్కను ఇంట్లో పెంచుకోవడం అనేది ప్రజల అభిరుచి లేదా ప్రేమ కావచ్చు. అయితే నేటికీ చాలా మందికి కుక్కని పెంచుకోవడం వలన కలిగే శుభ ఫలితాల గురించి తెలియదు. జ్యోతిష్యం ప్రకారం కుక్కను పెంచుకోవడం వలన అనేక గ్రహాల అశుభ ప్రభావాలు శుభప్రదంగా మారతాయి. ఈ రోజు కుక్క కి ఏ గ్రహంతో సంబంధం ఉందో తెలుసుకుందాం..

Dog Astrology: కుక్క విశ్వాసం గల జంతువే.. ఇంట్లో కుక్కని పెంచుకుంటే ఏ గ్రహాలు బలపడతాయో తెలుసా..
Dog Astrology

Updated on: Aug 14, 2025 | 12:46 PM

ఇళ్లలో ఎక్కువగా కనిపించే జంతువు కుక్క. ఇది విశ్వాసం గల జంతువు అందుకనే చాలా మంది కుక్కని తమ కుటుంబ సభ్యుల మాదిరిగానే తమ ఇళ్లలో పెంచుకుంటారు. తమ ఇంటి సభ్యులకు.. కుక్కలకు మధ్య వివక్ష చూపించరు. కుక్కలను తమ ఇళ్లలో సొంత ఇంటి పిల్లలకంటే ఎక్కువగా భావించి పెంచుకుంటారు. అయితే చాలా సార్లు ఇంట్లో కుక్కను ఉంచుకోవడం వల్ల అనేక గ్రహాలు బలపడతాయని, కుక్కకు సేవ చేయడం ద్వారా అనేక గ్రహాల అశుభ ప్రభావాలను శుభప్రదంగా మార్చవచ్చని వారికి తెలియదు.

జ్యోతిష్యం ప్రకారం ఇంట్లో కుక్కను పెంచుకోవడం వల్ల శని, కేతు గ్రహాలు బలపడతాయి. ముఖ్యంగా నల్ల కుక్క. ఇంట్లో కుక్కను పెంచుకోవడం వల్ల ప్రతికూల శక్తి నాశనం అవుతుంది. సానుకూల శక్తి వస్తుంది. అందుకనే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో నల్ల కుక్కను పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ నలుపు రంగు కుక్క పెంచుకోవడానికి వీలు కాకపోతే మీరు ఏ రంగు కుక్కనైనా ఉంచుకోవచ్చు.

శని గ్రహంతో సంబంధం

నల్ల కుక్కలను శనీశ్వరుడి వాహనంగా భావిస్తారు. శని గ్రహానికి శుభప్రదంగా భావిస్తారు. ఎవరి జాతకంలోనైనా శని దోషం, శని మహాదశ ఉంటే లేదా ఏలినాటి శని లేదా శని ధైయ్య జరుగుతుంటే నల్ల కుక్కలకు సేవ చేయడం,యు కుక్కలకు ఆహారం పెట్టడం వంటివి చాలా శుభప్రదం అని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

నల్ల కుక్కను శని దేవుడికి అత్యంత ఇష్టమైనదిగా భావిస్తారు. అంతేకాదు ఆ కుక్కను కాల భైరవుడి సేవకుడిగా కూడా భావిస్తారు.

కుక్కను ఎవరు పెంచుకోవచ్చు?

జ్యోతిషశాస్త్రం ప్రకారం కుక్కలు కూడా కేతు గ్రహానికి సంబంధించినవి. జాతకంలో సానుకూల కేతు స్థానం ఉన్న వ్యక్తులు కుక్కను పెంచుకోవచ్చు . ఇలా చేయడం ద్వారా కేతు గ్రహం సానుకూల ఫలితాలను పొందుతారు. చేపట్టిన పనిలో ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి. కుక్కను ప్రేమించడం, కుక్కలకు తినిపించడం లేదా దానికి సేవ చేయడం ద్వారా కేతువు అశుభ ప్రభావాలను నుంచి బయటప డవచ్చు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.