Astro Travel Tips: ఇంటినుంచి బయటకు వెళ్లే ముందు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి.. అన్నిపనులు సక్సెస్ అవుతాయి..

|

Jun 15, 2023 | 6:15 PM

ప్రతి వ్యక్తి ఏదో ఒక సందర్భంలో తప్పనిసరిగా ప్రయాణం సాగించాల్సి వస్తుంది. ఎక్కువ దూరమైనా.. తక్కువ దూరమైనా ప్రయాణం ప్రయాణమే. అయితే, ఇంటి నుంచి బయలుదేరే ముందు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.

Astro Travel Tips: ఇంటినుంచి బయటకు వెళ్లే ముందు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి.. అన్నిపనులు సక్సెస్ అవుతాయి..
Travelling
Follow us on

ప్రతి వ్యక్తి ఏదో ఒక సందర్భంలో తప్పనిసరిగా ప్రయాణం సాగించాల్సి వస్తుంది. ఎక్కువ దూరమైనా.. తక్కువ దూరమైనా ప్రయాణం ప్రయాణమే. అయితే, ఇంటి నుంచి బయలుదేరే ముందు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ ప్రయాణాలు కొన్నిసార్లు శుభప్రదమైన, విజయాన్ని ఇస్తాయి. కొన్నిసార్లు అపజయాన్ని, అపశకునాన్ని అందిస్తాయి. చేపట్టిన పనులు విఫలమవుతాయి.

హిందూవిశ్వాసం ప్రకారం.. ఏదైనా ప్రయాణం ఫలప్రదం అయ్యేందుకు ఇంటి నుంచి బయలుదేరే ముందు శుభ, అశుభ శకునాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ శకునాలు ప్రయాణాల సమయంలో చాలా కీలకం. ప్రయాణానికి సంబంధించి మంచి శకునాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. సనాతన సంప్రదాయం ప్రకారం.. ఏదైనా పని చేయడానికి ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు, ఎల్లప్పుడూ దేవతల చిత్రాలకు మొక్కడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

2. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మీ ప్రయాణం శుభప్రదంగా, విజయవంతం కావాలంటే ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు కుడి పాదాన్ని బయటకు తీయాలి.

3. ఏదైనా ముఖ్యమైన పని కోసం ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ఎవరితోనూ కోపంగా లేదా గొడవ పడకూడదు.

4. ఏదైనా ముఖ్యమైన పని కోసం వెళ్తున్నప్పుడు.. ఎవరైనా భిక్షాటన చేస్తూ వస్తే.. వీలైనంత వరకు సహాయం చేయాలి.

దిశలను శ్రద్ధ వహించాలి..

ప్రయాణంలో అశుభ, అశుభ శకునాల పట్ల శ్రద్ధ వహించడం ఎంత అవసరమో.. అదే విధంగా దిక్కులకు సంబంధించిన శుభ, అశుభాల పట్ల కూడా శ్రద్ధ వహించాలి.

పంచాంగం ప్రకారం.. సోమ, శనివారాలు తూర్పున, మంగళవారం, బుధవారం ఉత్తరంలో, శుక్రవారం, ఆదివారం పశ్చిమం దిశగా, గురువారం దక్షిణ దిశగా ప్రయాణం చేయాలి.

ఈ చెడు శకునాలను విస్మరించొద్దు..

ప్రయాణం సమయంలో కొన్ని చెడు శకునాలు కనిపిస్తాయి. వాటిని ఎప్పుడూ విస్మరించొద్దు. జ్యోతిష్యం ప్రకారం.. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఎవరితోనైనా గొడవలు జరిగినా, వెనుక నుంచి ఎవరైనా అడ్డగించినా కాసేపు ఆగి బయలుదేరాలి.

గాజు పగలడం, పాలు కింద పోవడం, ఎవరైనా తుమ్మడం, పిల్లి దారికి అడ్డు రావటం, కాకి తలపై వాలడం, వంటి సంఘటనలు జరిగితే వీలైతే ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలి. లేదంటే అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంది.

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, మత గ్రంధాల ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించండి.