Sunset
సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో చీకటిగా మారుతుంది. ఇది ప్రతికూలతకు చిహ్నంగా పరిగణించబడుతుంది. ప్రతికూల శక్తులు చీకటిలో ఆధిపత్యం చెలాయిస్తాయి. అంతేకాదు రాత్రి సమయంలో మాత్రమే తంత్ర సాధన చేస్తారు. హిందూ పురాణ గ్రంథాలలో సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులు చేయడం నిషేధించబడింది. ఈ పనులు చేయడం వల్ల ఆర్థికంగా నష్టపోతారు. లక్ష్మీదేవి కూడా ఇంట్లో ఉండదు. సాయంత్రం సమయంలో ఈ పనులు చేస్తే దరిద్రం పట్టుకుంటుంది.
హిందూ మతంలో అనేక విషయాలు ప్రస్తావించబడ్డాయి. అవి అనుసరించడానికి చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే అవి మన జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తాయి. చాలా మంది ఈ తప్పులను విస్మరిస్తారు, దీని కారణంగా వారు చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో సూర్యాస్తమయం తర్వాత ఏ పనులు చేయకూడదో తెలుసుకుందాం..
సూర్యాస్తమయం తర్వాత ఏమి చేయకూడదంటే
- ఇంటిని శుభ్రం చేయవద్దు – సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటిని తుడుచుకోకూడదు లేదా శుభ్రం చేయరాదు. ఇలా చేయడం వలన ఆర్ధిక కష్టాలు వస్తాయని నమ్మకం. చీపురు లక్ష్మిదేవితో ముడిపడి ఉన్నట్లు కనిపిస్తుంది. సాయంత్రం చీపురుతో శుభ్రం చేసే ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు.
- ఇంటి తలుపులు మూసి ఉంచ వద్దు – సూర్యాస్తమయం తర్వాత ఇంటి ప్రధాన తలుపును మూసి ఉంచవద్దు. హిందూ మత విశ్వాసం ప్రకారం లక్ష్మీ దేవితో సహా దేవతలు, సాయంత్రం వస్తారు. అటువంటి పరిస్థితిలో తలుపు మూసి ఉంచినట్లయితే బయట నుంచే తిరిగి వెళ్ళిపోతారు. సాయంత్రం వేళ ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించాలి. తద్వారా ఇంట్లో చీకట్లు ఉండవు.
- నిద్రించకూడదు – ఇంట్లో ఎవరూ సాయంత్రం నిద్రపోకూడదు. సాయంత్రం వేళలో నిద్రించడం వల్ల ప్రతికూలత ఏర్పడుతుంది. ఆ ఇంట్లో లక్ష్మి దేవి నివసించదు. సూర్యాస్తమయం సమయంలో ఇంట్లో నిద్రించడం వల్ల పురోగతి ఉండదు. ఎందుకంటే సంపదకు అధిదేవత అయిన లక్ష్మీ దేవి అక్కడికి రాదు.
- తులసి ఆకులు తెంచవద్దు – సాయంత్రం సమయంలో తులసి దళాలు తెంచరాదు. ఇలా చేయడం వలన లక్ష్మీ దేవికి కోపం రావచ్చు. ఇంట్లో దారిద్ర్యం నెలకొంటుంది. తులసి పూజ చేసి సాయంత్రం దీపదానం చేసే సంప్రదాయం ఉంది.
- వీటిని దానం చేయవద్దు – సాయంత్రం పొరపాటున కూడా పెరుగు, ఉప్పు, పసుపు, డబ్బు మొదలైన వాటిని ఇవ్వొద్దు. అంతే కాదు సూదులు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, పుల్లని వస్తువులను సూర్యాస్తమయ సమయంలో ఇంటి నుంచి బయటకు తీసుకుని వెళ్ళవద్దు. ఇలా చేయడం అశుభంగా భావిస్తారు. నమ్మకం ప్రకారం సాయంత్రం ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దు ఇలా చేయడం వల్ల ఇంట్లోని లక్ష్మి పోతుంది.
- బట్టలు ఉతకవద్దు – సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతకడం లేదా శుభ్రం చేయడం చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల డబ్బులకు ఇబ్బంది ఏర్పడి ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. అటువంటి పరిస్థితిలో సాయంత్రం బట్టలు ఉతకకూడదు.
- జుట్టు , గోర్లు కత్తిరించ వద్దు – సూర్యాస్తమయం తర్వాత జుట్టు లేదా గోళ్లను కత్తిరించకూడదు. వాస్తు ప్రకారం ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అందువల్ల, సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతకడం, గోర్లు, జుట్టు కత్తిరించడం నిషేధించబడింది.
మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.