
జ్యోతిషశాస్త్రం ప్రకారం అన్ని రాశికి చెందిన వ్యక్తులు ఒకేలా ఉండరు. అంత ఎందుకు ఒకే రాశిలో జన్మించిన వారు కూడా ఒకేలా ఉండరట ఎందుకంటే పుట్టిన సమయం, ప్రాంతం ఇలాంటి వివిధ కారణాలతో ఒకొక్కరు ఒకొక్క స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అయితే అతని జాతకం .. జన్మ నక్షత్రం, రాశి ప్రకారం అతని వ్యక్తిత్వం గురించి జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా తెలుసుకోవచ్చు. ఈ నేపధ్యంలో ఈ రోజు మనం ప్రేమ విషయాలలో మోసం చేసే రాశులు గురించి తెలుసుకుందాం.
మిథున రాశి
జ్యోతిషశాస్త్రం ప్రకారం మిథున రాశి వారు ప్రేమ విషయాలలో చాలా డిమాండింగ్ గా ఉంటారు. తాము కోరుకున్న ప్రేమ లభించకపోతే.. తమ భాగస్వాములను మార్చడానికి ఎక్కువ సమయం తీసుకోరు. మిథున రాశి స్త్రీలు ఎవరిని తమ భాగస్వామిగా ఎంచుకోవాలో తరచుగా సందిగ్ధంలో ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారి ప్రత్యేకత ఏమిటంటే తాము కోరుకున్న లేదా కోరుకునే ప్రేమ లభించనప్పుడు వెంటనే తమ భాగస్వామిని మోసం చేయడానికి వెనుకాడరు.
సింహ రాశి
సింహ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా నాటకీయంగా ఉంటారు. వీరి అందరూ తమ వైపు దృష్టిని ఆకర్షించుకోవడానికి ఇష్టపడతారు. అంతేకాదు తన భాగస్వామి కంటే తమకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ప్రేమలో మోసం చేయడానికి ఇదే కారణం.
కుంభ రాశి
కుంభ రాశికి చెందిన వ్యక్తులు మోసం చేయడం సర్వసాధారణం. వారు ఒకేసారి చాలా మందితో ప్రేమాయణం నడుపుతారు. తమ భాగస్వామి గురించి ఎప్పుడు మనసు మార్చుకుంటారో వీరికే తెలియదు. ప్రేమించడం, మోసం చేయడం వీరికి ఒక సాధారణ విషయం. ఎవరి జీవితంలో నుంచి ఎప్పుడు వెళ్తారు.. ఎప్పుడు తిరిగి వస్తారో ఎవరూ చెప్పలేరు.
కన్య రాశి
కన్య రాశికి చెందిన వ్యక్తుల ప్రేమ గుణం గురించి మాట్లాడుకుంటే.. వీరు ఏదైనా సంబంధంలోకి చాలా త్వరగా ప్రవేశిస్తారు. అంటే ఎవరినైనా వెనుకా ముందు ఆలోచించకుండా ప్రేమిస్తారు. తరువాత ఈ సంబంధం నుంచి ఎలా బయటపడాలి.. ప్రేమించిన వారిని ఎలా వదిలిచుకోవాలని ఆలోచిస్తారు.
మీన రాశి
మీన రాశి వారు తమ భాగస్వామిని మోసం చేయడానికి ఎక్కువ సమయం తీసుకోరని చెబుతారు. ప్రేమ విషయాలలో వీరు చాలా మూడీగా ఉంటారు. ఏ చిన్న విషయానికి అయినా కోపం తెచ్చుకోవడం వీరి లక్షణం .చాలా సున్నితంగా ఉండటం వల్ల.. చిన్న కారణం దొరికినా చాలు.. మరుక్షణమే ప్రేమించిన వారిని వదిలిపెట్టేస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు