నేటి కాలంలో ఎక్కువ మంది జీవన శైలి, తిండి, నిద్ర అన్నీ మారిపోయాయి. ఈ తప్పుడు అలవాట్ల వల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలతో ఇబ్బంది పడుతున్నారు కూడా.. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..భూమిపై జన్మించిన వెంటనే వ్యక్తి జీవితం కర్మలను బట్టి సాగుతుందని.. నవ గ్రహాల శుభ, అశుభ ప్రభావాలతో మంచి చెడులు ఏర్పడతాయని నమ్మకం. జీవితంలో మనిషి చెడు అలవాట్లు, నవ గ్రహాల గమనం కారణం కారణంగా జీవితంలో పురోగతి ఆగిపోతుంది. అంతేకాదు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. ఎవరి జీవితంలోనైనా రకరకాల సమస్యలు ఉంటే.. ఎన్ని ప్రయత్నాలు చేసినా సమస్యల నుంచి బయటపడక పొతే మొదటగా మీ అలవాట్ల మీద దృష్టి పెట్టండి. జీవితంలో దుఃఖం, దురదృష్టానికి కారణమయ్యే అలవాట్లను వదిలివేయాలి. ఈ రోజు మనిషి ఏ అలవాట్ల వల్ల రకరకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందో తెలుసుకుందాం.
ఏ అలవాటు దురదృష్టాన్ని కలిగిస్తాయంటే
చాలా మందికి రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం ఉదయం ఆలస్యంగా నిద్ర లేవడం అలవాటు. ఎవరికైనా ఈ చెడు అలవాటు ఉంటే వెంటనే ఈ అలవాటుని మార్చుకోవాలి, ఎందుకంటే ఇలా ఆలస్యంగా నిద్ర లేచేవారు చంద్ర గ్రహానికి సంబంధించిన దోషాన్ని ఎదుర్కొంటారు. తరచుగా మానసిక ఒత్తిడికి గురవుతారు. అంతేకాదు శారీరక మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కనుక రాత్రి సరైన సమయంలో నిద్రపోవడం, సూర్యోదయ సమయంలో నిద్ర మేల్కొనడం ఉత్తమం.
బాత్రూమ్‌ను ఎప్పుడూ మురికిగా ఉంచవద్దు
బాత్రూమ్‌ను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచవద్దు. టాయిలెట్ ను మురికిగా ఉంచే అలవాటు మీకు ఉంటే వెంటనే ఈ అలవాటును మార్చుకోవాలి. ఎందుకంటే ఈ అలవాటు వలన రాహు-కేతువుల ప్రభావాలను ఎదుర్కోవలసి ఉంటుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మురికి బాత్రూమ్ కారణంగా వ్యక్తీ తన జీవితంలో ఆకస్మిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
సింక్‌లో ఖాళీ పాత్రలను ఎప్పుడూ ఉంచవద్దు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాత్రి భోజనం చేసిన తర్వాత ఖాళీ పాత్రలను ఎప్పుడూ సింక్‌లో ఉంచకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇది ఆర్థిక స్థితిని ప్రభావితం చేసే పెద్ద లోపంగా పరిగణించబడుతుంది. రాత్రి సముయంలో ఖాళీ పాత్రలను ఉంచే వారిపై సంపద దేవత లక్ష్మీదేవి కోపంగా ఉంటుందని.. జీవితంలో ఎల్లప్పుడూ డబ్బు కొరతతో ఇబ్బంది పడతారని నమ్మకం.
ఉమ్మివేసేటప్పుడు ఈ విషయాన్నీ గుర్తుంచుకోండి
ఇంట్లో లేదా బయట ఎక్కడైనా ఉమ్మి వేసే అలవాటు ఉంటే వెంటనే ఈ అలవాటును మార్చుకోండి. ఈ అలవాటు సమాజంలో కీర్తి, గౌరవ ప్రతిష్టలపై ప్రభావం చూపించ వచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎప్పుడైనా, ఎక్కడైనా ఉమ్మివేయడం వల్ల వ్యక్తి జాతకంలో బుధ గ్రహం ప్రభావం చూపుతుంది. బుధ దోషం వల్ల సమాజంలో వ్యక్తి ప్రతిష్ట మసగాబారే ప్రమాదం ఉంది.
తిన్న వెంటనే వంట పాత్రలను
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తిన్న తర్వాత భోజనం చేసిన ప్రదేశంలో పాత్రలను తీసి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయాలి. అంతేకాని తిన్న తర్వాత ఖాళీ పాత్రలను ఇంట్లోనే ఉంచే వ్యక్తులు చంద్రుడు, శని సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తిన్న తర్వాత తిన్న ప్లేట్‌ను తీసి.. దానిని శుభ్రం చేయాలి. లేకుంటే వ్యక్తుల జీవితంలో అన్ని రకాల మానసిక, ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
పాదరక్షలను ఎల్లప్పుడూ సరిగ్గా ఉంచుకోండి
ఇంట్లో ఎక్కడబడితే అక్కడ చెప్పులు, బూట్లు తీసివేసే అలవాటు ఉంటే.. వెంటనే మార్చుకోండి. పాదరక్షలను అక్కడ, ఇక్కడ చెల్లాచెదురుగా పెట్టె చెడు అలవాటు కారణంగా జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. జ్యోతిషశాస్త్రంలో పాదరక్షలకు సంబంధించిన ఈ చెడు అలవాటు కారణంగా శని సంబంధిత దోషాలను ఎదుర్కొంటాడు. అటువంటి పరిస్థితిలో బూట్లు, చెప్పులు సరిగ్గా ఉంచండి.
ఇంట్లో ఎండిన మొక్కలను ఉంచవద్దు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో మొక్కలను ఎండిపోకుండా ప్రతిరోజు తగినంత శ్రద్ధ పెట్టాలి. మొక్కలను ఎరువులు, నీరు పోస్తూ సేవ చేయాలి. ఈ నియమాన్ని విస్మరించి ఎండిన మొక్కలు ఇంట్లో ఉంటే బుధ దోషం ఏర్పడుతుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఎండిన మొక్క ఇంట్లో ప్రతికూల శక్తిని సృష్టిస్తుంది. అటువంటి పరిస్థితిలో వెంటనే ఆ మొక్కను ఇంటి నుండి తీసివేసి, దాని స్థానంలో మళ్ళీ కొత్త మొక్కను నాటండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు