Astro Tips: అమ్మాయిలు ఈ తప్పులు చేస్తున్నారా… భర్త, కుటుంబ సభ్యులకు అష్ట కష్టాలు..

|

May 22, 2024 | 2:38 PM

నేటి జనరేషన్ తెలిసి కూడా చేసే తప్పులతో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇంట్లోని స్త్రీలు చేసే తప్పుల వలన ఆమె భర్త, కుటుంబ సభ్యులు సమస్యలను ఎదుర్కొనవచ్చు. లేదా అనుకున్న పనులు నెరవేరక ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటూ జీవితం చిక్కులు, చికాకులతో సాగవచ్చు. అనుకున్నది సాధించలేకపోవచ్చు. తమ లక్ష్యాన్ని చేరుకోలేరు. ఆడపిల్ల చేసే కొన్ని తప్పుల వల్ల భర్త లేదా కుటుంబం కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో లాభం పొందరు. ఈ నేపధ్యంలో అమ్మాయిలు చేసే తప్పులు ఏమిటో.. అవి ఎందుకు చేయకూడదో ఈ రోజు తెలుసుకుందాం..

Astro Tips: అమ్మాయిలు ఈ తప్పులు చేస్తున్నారా... భర్త, కుటుంబ సభ్యులకు అష్ట కష్టాలు..
Astro Tips
Follow us on

యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః అంటే ఎక్కడ స్త్రీలు దేవతలుగా పూజింప బడతారో ఆ ఇంట్లో సిరి సంపదలు, సుఖ సంతోషాలకు లోటు ఉండదని హిందూ సనాతన ధర్మంలోని నమ్మకం. అయితే కాలం మారింది.. కాలంతో పాటు ఇంట్లో ఉన్న మనుషుల అలవాట్లు జీవన విధానంలో కూడా మార్పులు వచ్చాయి. అలాంటి మార్పులతో జీవితంలో లక్ష్యాలను చేరుకోవడానికి అడ్డంకులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నేటి జనరేషన్ తెలిసి కూడా చేసే తప్పులతో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇంట్లోని స్త్రీలు చేసే తప్పుల వలన ఆమె భర్త, కుటుంబ సభ్యులు సమస్యలను ఎదుర్కొనవచ్చు. లేదా అనుకున్న పనులు నెరవేరక ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటూ జీవితం చిక్కులు, చికాకులతో సాగవచ్చు. అనుకున్నది సాధించలేకపోవచ్చు. తమ లక్ష్యాన్ని చేరుకోలేరు. ఆడపిల్ల చేసే కొన్ని తప్పుల వల్ల భర్త లేదా కుటుంబం కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో లాభం పొందరు. ఈ నేపధ్యంలో అమ్మాయిలు చేసే తప్పులు ఏమిటో.. అవి ఎందుకు చేయకూడదో ఈ రోజు తెలుసుకుందాం..

  1. అమ్మాయిలు తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. అన్నింటిలో మొదటిది.. అమ్మాయిలు ఉదయం ఆలస్యంగా నిద్ర లేవడం. ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం ఆడపిల్లలకు మంచిది కాదు. అనర్థాలను తెస్తుంది. ఇంట్లోని ఆడపిల్లలు తెల్లవారుజామున నిద్రలేవడం ఆ ఇంటికి మంచిది అని పెద్దల నమ్మకం.
  2. ఏ స్త్రీ అయినా పొరపాటున కూడా ద్వేషం తెలియజేస్తూ శాపం పెట్టరాదు. ఎందుకంటే ఆడపిల్ల శాపం పెట్టిన ఇంట్లో సుఖ సంతోషాలు ఉండవని పురాణాలు చెబుతున్నాయి. అదే విధంగా గొడవ పడే ఆడపిల్లలుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. కుమార్తెలు లక్ష్మీ దేవి స్వరూపం. వారి ఆనందం ఇంటికి మంచిది. ఆడవారి కన్నీళ్లు ఆ ఇంటికి మంచిది కాదని అంటారు.
  3. ఆడపిల్లలు తాము వాడుతున్న చేతుల గాజులు, కాళ్ల పట్టీలు ఇతరులకు ఇవ్వకూడదు. ఎందుకంటే గాజులు లక్ష్మీదేవి స్వరూపం కనుక వాటిని మరొకరికి ఇవ్వడం లక్ష్మీదేవిని ఇవ్వడంగా భావిస్తారు.
  4. ఏ ఇల్లాలు అయినా తమ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఎవరి ఇల్లు పరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది.
  5. ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు