సాధారణంగా రోజు ప్రారంభం మంచిగా.. శుభప్రదంగా ఉంటే ఆ రోజంతా చక్కగా గడిచిపోతుందని నమ్మకం. ఉదయం నుంచి మనసులో పాజిటివ్ ఆలోచనలు వస్తే ఆ రోజంతా మనసు ఉల్లాసంగా ఉండి ఒత్తిడి లేకుండా గడిచిపోతుంది. కనుక ప్రతి రోజూ ఉదయం కొన్ని పనులు చేయడం వలన రోజు బాగా విడిచిపోతుంది. చాలా మందికి రోజు మొదలైందంటే చాలు.. ఆర్ధిక, మానసిక సమస్యలు కలగవచ్చు.. అందుకని వీటి నుంచి బయటపడవలసి ఉంటుంది. రోజు మొదలైతే చాలు.. లక్ష్మీ దేవి ఆశీర్వాదం తమపై ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. తద్వారా జీవితంలోని ప్రతి రోజు ఆనందంగా.. ఎటువంటి సమస్యలు లేకుండా గడపవచ్చు. జ్యోతిషశాస్త్రంలో.. ఉదయాన్నే మనస్సులో సానుకూల ఆలోచనలు కలగడానికి.. లక్ష్మీ దేవిని ప్రసన్నం కోసం కొన్ని చర్యలు చెప్పారు. ఈ చర్యలు తీసుకుంటే.. ఆ రోజు మొత్తం బాగా గడిచిపోతుంది.
ఉదయం లేచిన వెంటనే రెండు అరచేతులను చూసుకోండి..
రోజు ప్రారంభం బాగుండాలంటే.. ఉదయాన్నే లేచిన వెంటనే.. రెండు అరచేతులను కలిపి రుద్ది అప్పుడు అరచేతులను చూడడండి. ఇలా చేయడానికి జ్యోతిష్య శాస్త్రంలో ఒక రీజన్ కూడా చెప్పరు. మన అరచేతిలో లక్ష్మీ దేవి, సరస్వతి దేవి, బ్రహ్మ నివసిస్తారు. కనుక రెండు అరచేతులను కలిపి రుద్దుతూ.. కరాగ్రే వసతే లక్ష్మీ, కర మధ్యే సరస్వతీ, కరమూలే స్థితో బ్రహ్మ ప్రభాతే కర్దర్శనం అంటూ ఈ మంత్రాన్ని జపించండి
భూమికి వందనం
ఉదయం మీ రెండు అరచేతులను దర్శనం చేసుకున్న అనంతరం మంచం మీద నుండి దిగే ముందు.. మీరు భూమిని తాకి నమస్కరించాలి. ఈ పరిహారంతో.. రోజంతా సానుకూలంగా సాగుతుంది. రోజు బాగా గడిచిపోతుంది.
ఉదయాన్నే సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించడం
ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే నిద్రలేచి.. నిత్యకృత్యాలు తీర్చుకుని.. తర్వాత స్నానం చేసి రాగి పాత్రలో నీరు తీసుకుని సూర్య భగవానుడికి జలాన్ని సమర్పించడం మంచిదని శాస్త్రాలలో చెప్పబడింది. ఇలా చేయడం వలన రోజు మంచిగా గడుస్తుంది. సూర్యదేవునికి అర్ఘ్యం సమర్పించే సమయంలో అక్షత, కుంకుమ, పువ్వులను నీటిలో వేయండి.
తులసి పూజ
సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత, ఇంటి ప్రాంగణంలో ఉన్న తులసి మొక్కకు కూడా నీరు సమర్పించి.. ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే మంత్రాన్ని జపించండి. ప్రతిరోజూ ఉదయం ఇలా చేయడం వల్ల లక్ష్మీ, విష్ణువు అనుగ్రహం లభిస్తుంది.
ఉదయం ఉప్పు నీటితో ఇంటిని శుభ్రపరుచుకోండి
వాస్తు ప్రకారం ప్రతికూల శక్తి ఇంట్లోకి ఎప్పటికప్పుడు ప్రవేశిస్తూనే ఉంటుంది. కనుక రోజూ ఉదయాన్నే నీళ్లలో ఉప్పు వేసి ఇంటిని తుడుచుకోవాలి. ఇలా చేయడం వల్ల రాత్రిపూట ఇంట్లో ప్రవేశించిన నెగెటివ్ ఎనర్జీ అంతమై రోజంతా ఆనందంగా, ప్రశాంతంగా గడిచిపోతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)