Andhra Pradesh: సనాతన ధర్మం ప్రకారం హిందువులు కోట్లాది దేవతామూర్తులను పూజిస్తున్నారు. ఆది దేవుళ్లైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మొదలు, గ్రామ దేవతల వరకు రకరకాలు కొలుస్తుంటారు భక్తులు. ముఖ్యంగా భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ దేవతలను ప్రత్యేక పద్ధతుల్లో ఆరాధిస్తారు. పెద్ద పెద్ద జాతరలు నిర్వహిస్తారు. జంతు బలులు ఇస్తారు. గ్రామ దేవతల పూజా కార్యక్రమాలన్ని డిఫరెంట్‌గా ఉంటాయి. వింత వింత ఆచార సంప్రదాయాలు ఉంటాయి. అక్కడెక్కడో ఎందుకు.. మన ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలోనూ గ్రామీణ దేవతలకు జాతరలు నిర్వహిస్తారు. యు.కొత్తపల్లి మండలం అమినాబాధ్ గ్రామంలో పోలెరమ్మ జాతరలో వింత ఆచారాం ఉంది. భక్తులు అక్కడ దున్నపోతుతో తొక్కించుకుంటారు. అలా దున్నపోతుతో తొక్కించుకుంటే.. కోరిన కోర్కెలను అమ్మవారు తీరుస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
అవును.. తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం అమినాబాధ్ గ్రామంలో అంగరంగ వైభవంగా పోలెరమ్మ జాతర జరుగుతోంది. అయితే, ఈ జాతరలో వింత ఆచారం ఉంది. అమ్మవారిని కోరిన కోర్కెలు తీరాలంటే దున్నపోతుతో తొక్కించుకుంటారు భక్తులు. ప్రతి ఏటా కొత్త అమావాస్య ముందురోజు జరిగే పోలెరమ్మ జాతరలో ఈ వింత ఆచారం ఏళ్లుగా వస్తోంది. చిన్నలు, పెద్దలు, మహిళలు, యువకులు రోడ్డుపై వరుసగా బోర్లా పడుకుంటారు. వారి పై నుంచి అమ్మవారు పూనిన మహిళ.. దున్నపోతు దూడ పట్టుకుని తొకుక్కుంటూ వెళ్లారు. ఇది అక్కడి ఆచారం అని భక్తులు చెబుతున్నారు. తరతరాలుగా వస్తున్న ఆచారం అని, గ్రామంలో ప్రతీ ఒక్కరు ఈ వేడుకల్లో పాల్గొంటారని గ్రామస్తులు చెబుతున్నారు.
Also read:
Puzzle Picture: ‘దమ్ముంటే నన్ను కనిపెట్టండి’.. డాగ్ విసిరిన సవాల్.. ఆన్సర్ చెప్పే సత్తా మీలో ఉందా?