Tirumala Tirupati : తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం.. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం

|

Jul 21, 2022 | 4:27 PM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 29 కంపార్ట్‌ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు...ఆ ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆల‌యంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు

Tirumala Tirupati : తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం.. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం
Ttd Hundi Income
Follow us on

Tirumala: విద్యా సంవత్సరం మొదలైంది. అయిప్పటికీ తిరుమల శ్రీవారి సన్నిధికి వచ్చే భక్తుల సంఖ్య మాత్రం తగ్గటం లేదు. కుండపోత వర్షాలు కుమ్మరిస్తున్నప్పటికీ శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 29 కంపార్ట్‌ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని అధికారులు పేర్కొన్నారు. బుధవారం ఒక్కరోజే తిరుమల శ్రీవారిని 76,821 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 34,732 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.78 కోట్లు వచ్చిందని తెలిపారు.

ఇదిలా ఉంటే, శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు సంబంధించిన తేదీలను ప్రకటించింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆగ‌స్టు 8 నుంచి 10వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్టు ప్రకటించింది టీటీడీ. ఆగ‌స్టు 7న అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఆగ‌స్టు 8న పవిత్రాల ప్రతిష్ట, ఆగ‌స్టు 9న పవిత్ర సమర్పణ, ఆగస్టు 10న పూర్ణాహుతి కార్య‌క్ర‌మాలు నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆల‌యంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వ‌హిస్తారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మీక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి