
Jagannath Rath Yatra 2025: హిందూ మత విశ్వాసాల ప్రకారం, పూరి పట్టణంలోని జగన్నాథుని తీర్థయాత్ర ఎంతో పవిత్రమైనది. ఈ యాత్రలో పాల్గొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు లక్షలాది సంఖ్యలో తరలివస్తారు. ఈ ఏడాది పూరి జగన్నాథ రథయాత్రకు ఏర్పాట్లు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. అక్షయ తృతీయ రోజు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, రథం నిర్మాణాన్ని ప్రారంభించారు. ఆషాడ మాసం రెండో రోజు (జూన్ 27) నుంచి రథయాత్ర ప్రారంభమవుతుంది. ఇది 12 రోజులపాటు జరుగుతుంది.
సాధారణంగా హిందూ దేవాలయాలలో ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. అయితే పూరిలో జగన్నాథ్, బలభద్ర, సుబధ్రల మూలవిరాట్ విగ్రహాలే ప్రత్యేకంగా ఊరేగింపులో భాగంగా ఉంటాయి. ఈ జగన్నాథుని రథయాత్రలో పాల్గొనడం వల్ల అన్ని తీర్థయాత్రల ఫలాలు లభిస్తాయని చాలా మంది నమ్ముతారు.
వీడియో ఇక్కడ చూడండి..
విశ్వాసాల ప్రకారం, జగన్నాథుడిని శ్రీ మహా విష్ణువు అవతారంగా చెబుతారు. ప్రతి ఏటా జరిగే ఈ రథయాత్రకు శ్రీ జగన్నాథ పురి, పురుషోత్తమ పురి, శంఖ క్షేత్రం, శ్రీ క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఈ యాత్రలో దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు. ఈ యాత్రలో పాల్గొంటే ఎంతో పుణ్య ఫలాలు దక్కుతాయని నమ్ముతారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..