AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akshaya Tritiya 2025: లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంటి దగ్గర ఏ దిశలో, ఎక్కడ దీపాలు పెట్టాలంటే..

అక్షయ తృతీయ పండగను హిందువులు ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున లక్ష్మీదేవి అనుగ్రహం కోసం సంపద, శ్రేయస్సు కోసం ఇంట్లో దీపాలు వెలిగించడం చాలా ముఖ్యం. ఉత్తర దిశలో ప్రధాన ద్వారం దగ్గర దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని.. ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని.. పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని విశ్వాసం.

Akshaya Tritiya 2025: లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంటి దగ్గర ఏ దిశలో, ఎక్కడ దీపాలు పెట్టాలంటే..
Akshaya Tritiya 2025
Surya Kala
|

Updated on: Apr 16, 2025 | 12:17 PM

Share

ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో తృతీయ రోజున అక్షయ తృతీయ జరుపుకుంటారు. ఈ సంవత్సరం 2025 అక్షయ తృతీయ పండగను ఏప్రిల్ 30 న జరుపుకోనున్నారు. సంపదకు అధిపతి అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ రోజున బంగారం, వెండి నగలు కొనడం ఆచారం. బంగారం, వెండి కొనడం వల్ల ఇంటికి సంపద, శ్రేయస్సు వస్తుందని చాలా మంది నమ్మకం. వీటిని కొనడమే కాదు ఈ ప్రత్యేక రోజున దీపాలు వెలిగించడం కూడా ముఖ్యం. శాశ్వత ప్రయోజనాలను పొందాలంటే అక్షయ తృతీయ రోజున మీ ఇంట్లో దీపం ఎక్కడ వెలిగించాలో ఈ రోజు తెలుసుకుందాం..

ఈ దిశలో దీపం వెలిగించండి:

ఇంటి ఉత్తర దిశను సంపదకు అధిపతి అయిన కుబేరుడు, లక్ష్మీ దేవి దిశగా పరిగణిస్తారు. అక్షయ తృతీయ రోజున ఇంట్లో ఈ దిశలో దీపం వెలిగించడం వల్ల సంపద, శ్రేయస్సు, ఆనందం, శాంతి లభిస్తాయని నమ్ముతారు.

ఇంట్లో నీరు పెట్టుకునే చోట దీపం వెలిగించండి:

ఇంట్లో త్రాగునీరు నిల్వ ఉంచడానికి వంటగదిలో ఒక ప్రత్యేక స్థలం ఉంటుంది. అక్షయ తృతీయ సాయంత్రం ఇక్కడ కూడా దీపం వెలిగించండి. ఇలా చేయడం ద్వారా మీ పూర్వీకుల ఆశీస్సులు మీపై ఉంటాయని, భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయని నమ్ముతారు. మీ ఇంటి ఆవరణలో బావి, చెరువు లేదా ఇతర నీటి వనరులు ఉంటే అక్కడ కూడా దీపం వెలిగించాలి. నీటి వనరుల దగ్గర దీపాలు వెలిగించడం ప్రకృతికి, దేవతలకు కృతజ్ఞతను వ్యక్తపరిచే ఒక మార్గం.

ఇవి కూడా చదవండి

ఇంటి ప్రధాన ద్వారం:

అక్షయ తృతీయ సాయంత్రం, ఇంటి ప్రధాన ద్వారం రెండు వైపులా నెయ్యితో చేసిన మట్టి దీపాలను వెలిగించండి. ఇక్కడి నుండే లక్ష్మీ దేవి ఇంట్లోకి అడుగు పెడుతుందని నమ్మకం. వెలుతురు, పరిశుభ్రత ఉన్న చోట మాత్రమే లక్ష్మీ దేవి నివసిస్తుంది. ఇక్కడ దీపం వెలిగించడం వల్ల సంపద, శ్రేయస్సు పెరుగుతుందని నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..