హిందూ క్యాలెండర్ ప్రకారం.. వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో తృతీయ తిథి నాడు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం అక్షయ తృతీయ పండగ శనివారం, 22 ఏప్రిల్ 2023న వస్తుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ ప్రత్యేకమైన రోజున లక్ష్మీదేవి, విష్ణువును పూజిస్తారు. ఈ రోజున నియమ నిబంధనల ప్రకారం పూజించిన వారికి శుభ ఫలితాలు లభిస్తాయని నమ్మకం. ఈ ప్రత్యేకమైన రోజున బంగారం కొనాలని ఎక్కువ మంది భావిస్తారు. అయితే నేటి కాలంలో బంగారం చాలా ఖరీదైనది.. కనుక బంగారం కొనడం అందరికీ సాధ్యం కాదు. అటువంటి పరిస్థితిలో దీనికి సంబంధించిన కొన్ని చర్యలు ఉన్నాయి. ఈ పరిహారాలు చేయడం ద్వారా బంగారం వంటి ఫలాన్ని పొందవచ్చు. బంగారం లాంటి ఫలాలను ఇచ్చే ఆ రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం
పురాణాల ప్రకారం అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి భక్తులకు శుభఫలితాలను అందిస్తుంది. అయితే జ్యోతిష్యం ప్రకారం బంగారం కొనలేకపోతే బార్లీని కొనండి. కేవలం ఐదు రూపాయలకే బార్లీని కొని పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి సమర్పించండి. సృష్టిలో మానవుల మొదటి ఆహారం బార్లీ అని.. అంతేకాదు బార్లీ విష్ణువు చిహ్నం అని కూడా నమ్మకం.
అక్షయ తృతీయ నాడు చేయాల్సిన చర్యలు ఏమిటంటే?
ఈ ప్రత్యేకమైన రోజున లక్ష్మీ దేవిని పూజించాలని నమ్మకం. విష్ణువును పూజించడం కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని విశ్వాసం.
హిందూ సనాతన విశ్వాసాల ప్రకారం అక్షయ తృతీయ రోజున శ్రీ యంత్రం, కుబేరు యంత్రాన్ని పూజించడం కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఈ ప్రత్యేక రోజున ఈ యంత్రాలను పూజించడం చాలా శుభప్రదం. ఇది మీ ఆర్థిక సమస్యలను దూరం చేస్తుంది.
అక్షయ తృతీయ నాడు ఉదయాన్నే తులసి మొక్క దగ్గర ఐదు రూపాయల నాణేన్ని ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం.
ఈ ప్రత్యేకమైన రోజున, లక్ష్మీదేవిని పూజించేటప్పుడు బార్లీని సమర్పించండి. ఇలా చేయడం బంగారం సమర్పించినట్లు భావిస్తారు. మీకు శుభ ఫలితాలను ఇస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)