ఆచార్య చాణక్యుడు ఆర్థికశాస్త్రం, సామాజిక శాస్త్రం, రాజకీయాలు మొదలైన అన్ని విషయాలలో నైపుణ్యం కలిగి ఉన్నాడు. ఆచార్య చాణక్య తన జీవితాన్ని అనేక ఇబ్బందుల్లో జీవించాడు. కానీ పరిస్థితుల ముందు ఎప్పుడూ తలవంచలేదు. కానీ వాటిని నిశితంగా అధ్యయనం చేసి నేర్చుకున్నాడు. నిత్య జీవితంలో ఎదుర్కొన్నే సమస్యలు.. వాటికి పరిష్కారాలను ఆయన చూపించాడు. చాణక్యుడు చతుర్విధపురుషార్దాలలో రెండవదైన ‘అర్ధ’ పురుషార్ధము గురించి అర్దశాస్త్రాన్ని రచించాడు. చాణక్యుడు రాజనీతి శాస్త్రంతో పాటు ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రం, మనస్తత్వ శాస్త్రంలో కూడా నిపుణత కనబరిచాడు.
చాణక్య నీతిలో మానవ సంక్షేమానికి సంబంధించిన అనేక విషయాలు ప్రస్తావించబడ్డాయి. ఇవి నేటి కాలానికి కూడా ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. ఇబ్బుందుల్లో ఉన్న వ్యక్తులకు ఆచార్యుడి మాటలు ఔషదంలా పని చేస్తుంటాయి. అంతేకాదు ప్రతికూల సమయాల్లో మార్గనిర్దేశం చేసి దారిని చూపుతాయి. ఆచార్య చాణక్యుడు నీతి గ్రంధంలో అలాంటివి కొన్ని కీలకంగా ప్రస్తావించాడు.
1. ఆచార్య చాణక్య చెప్పినదాని ప్రకారం… ఎక్కువసేపు నిద్రపోతున్న వ్యక్తి తన సమయాన్ని వృధా చేయడంతో పాటు శక్తిని కూడా కోల్పోతాడు. ఉదయం ఉండే సమయాన్ని దైవిక సమయంగా పరిగణించబడుతుంది. ఆ సమయంలో ప్రతి ఒక్కరి శరీరంలో ఓ ప్రత్యేక శక్తి ఉంటుంది. దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ఈ సమయంలో మెలుకువతో ఉండటం వల్ల చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కానీ నిద్రిస్తున్న వ్యక్తి ఈ సమయం వృధా చేసుకుంటాడు. అలాంటి వ్యక్తి తన జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటాడు.
2. చాణక్య నీతిలో.. ఎవరైతే అపరిశుభ్రతోపాటు.. మురికి బట్టలు ధరించినవారు.. పళ్లను శుభ్రం చేసుకోనివారిపై లక్ష్మి దేవి కటాక్షం ఉండదని.. అలాంటి వ్యక్తులు ఎప్పటికీ సంపన్నలుగా ఉండలేరని తెలిపారు. వారి శరీరం త్వరలోనే వ్యాధుల బారిన పడుతుంది. దీని కారణంగా వారు ఏ పనిని సరిగా చేయలేరు. డబ్బును ఆదా చేయలేరు. ఎందుకంటే వారిని వ్యాధులు చుట్టు ముడుతుంటాయని తెలిపారు. దీనితో ఆస్పత్రల్లో చేరడం.. ఔషదాలు వాడటం.. డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ పరిశుభ్రతపై శ్రద్ధ వహించాలని చెప్పాడు.
3. అవసరానికి మించి తినడం.. అన్ని సమయాలలో ఆహారం పట్ల అత్యాశతో ఉండటం.. వ్యక్తిని పేదరికం వైపు నడిపిస్తుంది. ఆహారం మన మనుగడ సాధనం. అంతే కానీ దానినే జీవితంగా మార్చుకోవద్దు.
4. మీకు విజయం కావాలంటే.. మీరు ఖచ్చితంగా మధురమైన మాటలు మాట్లాడాలి. మధురమైన స్వరం మాట్లాడే వ్యక్తి అందరూ ఇష్టపడతారు. అయితే చేదు మాటలు మాట్లాడే వ్యక్తి తకు ఉండే అన్ని సంబంధాన్ని పాడుచేసుకుంటాడు. అంతే కాదు నిరాశకు గురవుతాడు. అలాంటి వ్యక్తులు ఎంత శ్రమించినప్పటికీ వారు విజయాన్ని సాధించలేరు.
ఇవి కూడా చదవండి: Telangana Cabinet: CM కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలకు గ్రీన్ సిగ్నల్