Vastu Tips: ఇంట్లో తీవ్ర ధన నష్టం ఉందా.? స్టోర్‌ రూమ్‌లో ఈ తప్పులు చేశారేమో చూసుకోండి..

|

Nov 03, 2023 | 2:34 PM

స్టోర్‌ రూమ్‌లో వాస్తు లోపాలు ఉన్నట్లుయితే కేతు, రాహు గ్రహాలు ఇంట్లో ఉన్న వారిపై ప్రతి కూల ప్రభావం చూపుతాయి. కాబట్టి స్టోర్‌ రూమ్‌లో కొన్ని వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. అలాంటి వాటిలో ఒకటి తుప్పు పట్టిన వస్తువులు. స్టోర్‌ రూమ్‌లో తుప్పు పట్టిన వస్తువులను ఉండకుండా చూసుకోవాలి, ఒకవేళ ఉన్నట్లైతే.. ఆర్థిక ప్రగతికి అడ్డుపడతాయి, ఇంట్లో ధన నష్టం పెరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు స్టోర్‌ రూమ్‌లో...

Vastu Tips: ఇంట్లో తీవ్ర ధన నష్టం ఉందా.? స్టోర్‌ రూమ్‌లో ఈ తప్పులు చేశారేమో చూసుకోండి..
Vastu Tips
Follow us on

ఇంటి నిర్మాణంలో వాస్తు ప్రాముఖ్యత ఎంత ఉంటుందో ఇంట్లో ఉండే వస్తువుల విషయంలోనూ అంతే ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతీ వస్తువు విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇంట్లో వాస్తు అనగానే చాలా మంది వంటగది, బెడ్ రూమ్‌, హాల్‌ వరకు మాత్రమే అనుకుంటారు. కానీ స్టోర్‌ రూమ్‌ కూడా వాస్తు ప్రకారమే ఉండాలని వాస్తు పండితులు చెబుతున్నారు. అలా లేకపోతే ఇంట్లో ఆర్థిక నష్టం తప్పదని చెబుతున్నారు. ఇంతకీ స్టోర్‌ రూమ్‌లో ఎలాంటి వాస్తు టిప్స్‌ పాటించాలంటే..

స్టోర్‌ రూమ్‌లో వాస్తు లోపాలు ఉన్నట్లుయితే కేతు, రాహు గ్రహాలు ఇంట్లో ఉన్న వారిపై ప్రతి కూల ప్రభావం చూపుతాయి. కాబట్టి స్టోర్‌ రూమ్‌లో కొన్ని వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. అలాంటి వాటిలో ఒకటి తుప్పు పట్టిన వస్తువులు. స్టోర్‌ రూమ్‌లో తుప్పు పట్టిన వస్తువులను ఉండకుండా చూసుకోవాలి, ఒకవేళ ఉన్నట్లైతే.. ఆర్థిక ప్రగతికి అడ్డుపడతాయి, ఇంట్లో ధన నష్టం పెరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు స్టోర్‌ రూమ్‌లో తుప్పు పట్టిన వస్తువులు ఉంచకూడదు.

ఇక స్టోర్‌ రూమ్‌ అంటే పాడై పోయిన వస్తువులను మాత్రమే ఉంచడానికి అనే భావనలో ఉంటారు. కానీ అలా ఏమాత్రం చేయకూడదు పాడై పోయి, పనికిరాని వస్తువులను స్టోర్‌ రూమ్‌లో ఉంచకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. అలాగే స్టోర్‌ రూమ్‌లో ఇత్తడి పాత్రలు కూడా ఉండకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇత్తడి పాత్రలో శని దేవుడు ఉంటాడని నమ్మకం, కాబట్టి ఇత్తడి పాత్రలను స్టోర్‌ రూమ్‌లో పడేస్తే శని ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

స్టోర్‌ రూమ్‌లో పాడైపోయిన వాచ్‌లు, కుట్టు మిషన్లు, పూజగది సామాగ్రిని ఉంచకూడదు. ఇలా ఉంచినట్లైతే పేదరికం పెరుగుతుంది. అలాగే స్టోర్‌ రూమ్‌లో కత్తులు, కత్తెరలు వంటి వస్తువులను కూడా ఉంచకూడదు. విరిగిపోయిన వస్తువులను కూడా స్టోర్‌ రూమ్‌లో పెట్టకూడదు ఇలా చేస్తే ఇంట్లో ఆర్థిక నష్టాలు ఎదుర్కోక తప్పదు. ఇక చాలా మంది స్టోర్‌ రూమ్‌లో వస్తువులను ఎలాపడితే అలా పెట్టకూడదు, స్టోర్‌ రూమ్‌ చెత్తా చెదారం లేకుండా చూసుకోవాలి. చూశారుగా స్టోర్‌ రూమ్‌లో ఈ వాస్తు టిప్స్‌ పాటిస్తే వాస్తు దోషాల నుంచి ఉపశమనం పొందొచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..