ఈ మధ్యకాలంలో చాలామంది వాస్తును నమ్ముతున్నారు. ఏ పని ప్రారంభించినా వాస్తు ప్రకారమే చేస్తున్నారు. కొన్ని నియమాలు పాటించి అనుసరిస్తుంటాం. ముఖ్యంగా అష్టదిక్కులకు ప్రాధాన్యమిస్తూ…నడుకుంటాం. అయితే రాత్రి పడుకునే సమయం నుంచి ఉదయం లేచే వరకు అన్నికూడా వాస్తు నియమాలను అనుసరించి నడుకునేవాళ్లు చాలా మంది ఉన్నారు. రాత్రి పడుకునే సమయంలో తల ఏ దిక్కున పెట్టి పడుకుంటే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఉత్తరం వైపు తలపెట్టి అస్సలు పడుకోకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే ఈ దిక్కున తలపెట్టి పడుకుంటే..దక్షిణం కనిపిస్తుందని, అది యమస్థానమని శాస్త్రం అంటోంది.
పూర్వం ఉత్తరంవైపు తలపెట్టి పడుకున్న ఏనుగు తలను తీసుకురావాలని శివుడు ఆజ్ణాపిస్తాడు. అలాగే ఆ ఏనుగు తలను తీసుకువస్తారు. అందుకే ఈ దిక్కున తలపెట్టి పడుకుంటే అకాల మృత్యువు తప్పదని చెబుతుంటారు. పడమర వైపు కూడా తలపెట్టి పడుకోకూడదని పెద్దలు చెబుతుంటారు. ఈ దిక్కున తలపెట్టి పడుకుంటే తూర్పు వైపు కాళ్లు పెట్టాలి. ఉదయించే సూర్యుడు తూర్పు వైపు ఉదయిస్తాడు కాబట్టి పడమరవైపు తలపెట్టి పడుకోకూడదు.
మరి ఏ దిక్కున తలపెట్టి పడుకుంటే మంచిదనే సందేహం మీలో రావచ్చు. దీనికి జ్యోతిష్య పండితులు కొన్ని దిక్కులను సూచించారు. తూర్పు వైపున తలపెట్టి , పడమర వైపు కాళ్లు పెట్టి పడుకోవచ్చట. లేదంటే దక్షిణం వైపు తలపెట్టి ఉత్తరం వైపుగా కాళ్లుపెట్టి పడుకోవచ్చట. పడుకునేముందు కూడా జాగ్రత్తగా ఈ దిక్కులను అనుసరించి పడుకోవాలని శాస్త్రం చెబుతోంది.
వాస్తు ప్రకారం తల తూర్పు దిక్కున అంటే.. పాదాలు పడమర దిశలో తల పెట్టి నిద్రించడం ఆరోగ్యానికి మంచిది. వాస్తవానికి, సూర్యుడు తూర్పు నుండి ఉదయిస్తాడు. దాని మొదటి కిరణం తూర్పున మాత్రమే కనిపిస్తుంది. అందుకే ఈ దిశలో మీ తలపెట్టి నిద్రించడం వల్ల ఉదయపు మొదటి కిరణం మీ తలపై పడుతుంది. ఫలితంగా, మీ లోపల కొత్త శక్తి ప్రసారం అవుతుంది. ఈ దిశలో పాదాలతో నిద్రించడం వలన మీ మెదడుకు సరైన శక్తి అందదు.
దీన్ని మీరు ఆచరిస్తే ఐశ్వర్యంతో పాటు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అంతేకాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..