AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: జీవితంలోని ప్రతి మలుపులో ఈ విషయాలను గుర్తుంచుకోండి.. ప్రతి సమస్య తొలగిపోతుంది..

జీవితంలో ఆనందం కావాలంటే చాణక్యుడి ప్రకారం ఆయన సూచించిన విధానాలను సరిగ్గా అనుసరించాలి. ఒక వ్యక్తి తన పనులు, ప్రయత్నాల ఆధారంగా ఇంటిని స్వర్గంగా మార్చుకోగలడు. చాణక్యుడు చెప్పిన విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం..

Chanakya Niti: జీవితంలోని ప్రతి మలుపులో ఈ విషయాలను గుర్తుంచుకోండి.. ప్రతి సమస్య తొలగిపోతుంది..
Chanakya Niti
Surya Kala
|

Updated on: Dec 20, 2022 | 3:10 PM

Share

ఆచార్య చాణక్యుడు మంచి అధ్యాపకుడు, రాజనీతి శాస్త్ర కోవిదుడు. తన నీతి శాస్త్రంలో మానవ జీవితాన్ని సంబంధించిన మానవులు  జీవించడానికి సరైన మార్గాల గురించి చెప్పాడు. చాణక్యుడు చెప్పిన పద్ధతులు లేదా విషయాలు చాలా ప్రభావవంతంగా ఉన్నాయి.  నేటికీ ప్రజలు తమ జీవితాల్లో వాటిని అనుసరించడం వలన అనేక ప్రయోజనాలు ఉంటాయని పెద్దలు చెబుతారు. జీవితంలో ఆనందం కావాలంటే చాణక్యుడి ప్రకారం ఆయన సూచించిన విధానాలను సరిగ్గా అనుసరించాలి. ఒక వ్యక్తి తన పనులు, ప్రయత్నాల ఆధారంగా ఇంటిని స్వర్గంగా మార్చుకోగలడు. చాణక్యుడు చెప్పిన విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం.. వీటి ద్వారా ఇంటిని సంతోషంగా ఉంచుకోవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం..

ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి జీవితంలో రకరకాల పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఒకొక్కసారి పరిస్థితి మరింత దిగజారుతుంది. అలాంటి పరిస్థితుల్లో మామూలుగా ఉండడం సాధ్యం కాదు. ఎలాంటి ఇబ్బంది ఏర్పడినా ఎటువంటి పరిస్థితి ఎదురైనా తనను తాను ప్రశాంతంగా ఉంచుకునే వ్యక్తి ఇతరుల కంటే మెరుగైన విధంగా నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాడని చాణక్యుడు చెప్పాడు. ప్రశాంతంగా ఉండి.. ఆలోచించడం వల్ల విషయాలు సులభంగా అర్థమవుతాయి.

ఏ సంబంధానికైనా పరిమితి భార్యాభర్తల మధ్య సంబంధం ఇతర సంబంధాల కంటే నమ్మకం.. గౌరవంపై ఆధారపడి ఉంటుంది. ఈ బంధంలో ఒకరినొకరు గౌరవించుకోవడం తో  పాటు పరువును కూడా చూసుకోవాలి.  నమ్మకం గౌరవం కోల్పోయినప్పుడు ఏ సంబంధమైన అంతం అవడానికి  పని చేస్తుందని చాణక్యుడు చెప్పాడు. తన పరువును మరచిపోయి ప్రవర్తించే స్త్రీ లేదా పురుషుడు.. వారి బంధానికి బీటలు వారడానికి కి ఎక్కువ సమయం పట్టదు. చాణక్య విధానం ప్రకారం.. ప్రతి భార్యాభర్తలు తమ బంధాన్ని నిలబెట్టుకునే విధంగా ఉండాలి.

ఇవి కూడా చదవండి

కోపం ఇది మనలో దాగి ఉన్న భావన.. దానిని నియంత్రించకపోతే.. జీవితం పూర్తిగా నాశనం అవుతుంది. తన కోపాన్ని అదుపు చేసుకోలేని వ్యక్తి జీవితంలోని ప్రతి మలుపులోనూ ఇబ్బందికి గురి అవుతాడని చాణక్య నీతి చెబుతోంది. కోపం ఎక్కువగా ఉన్న వ్యక్తికీ శత్రువులు కూడా ఎక్కువ.. సమస్యలు చుట్టుముడుతూనే ఉంటాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)