Chanakya Niti
ఆచార్య చాణక్యుడు మంచి ఆర్థికవేత్త మాత్రమే కాదు..మంచి ఉపాధ్యాయుడు. నైపుణ్యం కలిగిన దౌత్యవేత్త కూడా. చాణక్యుడి విధానాలు నేటికీ మానవులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ఆచార్య చాణక్యుడు చెప్పిన విషయాలు.. విధానాలను ఆచరించడం ద్వారా.. ఏ వ్యక్తి అయినా తన జీవితాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో తప్పుగా సంపాదించిన డబ్బు మనిషితో ఎక్కువ కాలం ఉండదని పేర్కొన్నాడు. చాణక్యుడి విధానం ప్రకారం.. కొన్ని రకాలుగా సంపాదించే డబ్బులు ఆ వ్యక్తి వద్ద నిలబడవు.. అంతేకాదు ఆ మనిషి జీవితాన్ని నాశనం చేయడం ఖాయమని తెలిపాడు.
ఏ విధంగా సంపాదించిన డబ్బు వృధా అవుతుందంటే..
- ఆచార్య చాణక్యుడు లక్ష్మీదేవి చంచలమైనదని చెప్పాడు. అటువంటి పరిస్థితిలో.. ఒక వ్యక్తి దొంగతనం, జూదం, అన్యాయం, మోసం చేసి డబ్బు సంపాదిస్తే.. ఆ డబ్బు ఆ వ్యక్తి వద్ద నిలబడదు. అంతేకాదు వ్యక్తి జీవితం త్వరగా నాశనం అవుతుంది.
- పేదరికం, వ్యాధి, దుఃఖం, బానిసత్వం, చెడు అలవాట్లు, ఇవన్నీ మనిషి కర్మల ఫలితమే. చాణక్య నీతి ప్రకారం.. ఏ వ్యక్తి ఏ విత్తనం నాటితే.. అదే ఫలాన్ని పొందుతాడు.
- ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం.. ఏ వ్యక్తిని ఎప్పుడూ డబ్బు లేని వ్యక్తిగా పరిగణించకూడదు. ఒక వ్యక్తి అజ్ఞానం వల్ల అధమంగా ఉంటాడే తప్ప సంపద లేక పోవడం వలన మాత్రం కాదు.
- విజ్ఞానం, తెలివి తేటలు లేని వ్యక్తి ఎన్ని రకాల సుఖాలున్నా.. సంపదలున్నా అల్పుడు అవుతాడు. అందుకే ఒక వ్యక్తి జ్ఞానాన్ని సంపాదించడానికి ఎప్పుడూ వెనుకడుగు వేయకూడదు.
- చాణక్య విధానం ప్రకారం.. ఏ వ్యక్తి అయినా ఇతరుల మనసుని గాయపరిచి డబ్బు సంపాదించకూడదు. ఎదుటివారిని కన్నీరు పెట్టి సంపాదించిన సంపద త్వరలో నాశనం అవుతుంది.
- చాణక్యుడి ప్రకారం.. డబ్బు సంపాదించడానికి ఎవరినీ హింసించకూడదు.. గాయపరచకూడదు. ఈ విధంగా సంపాదించిన డబ్బు ఆ వ్యక్తి వద్ద ఎప్పటికీ నిలవదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)