తెలంగాణ కుంభమేళా మేడారం సమక్క – సారక్క మహా జాతర వైభవంగా ముగిసింది. ఫిబ్రవరి 21 నుంచి 24వ వరకు నాలుగు రోజులపాటు రాష్ట్ర సర్కార్ ఆధ్వర్యంలో మహాజాతరకు దాదాపు కోటి 40 లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు..తాజాగా జాతరలో భక్తులు అమ్మవార్లకు వేసిన కానుకల హుండీ లెక్కింపు మొదలైంది..ఎండోమెంట్, రెవెన్యూ, జాతర ట్రస్ట్ బోర్డు సభ్యులు సమక్షంలో హుండీలు తెరిచారు..హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో పోలీస్ పహారా, సీసీ కెమెరాల నిఘా మధ్య హుండీలు లెక్కింపు కొనసాగుతుంది..
మేడారం హుండీలలో విచిత్రాలు కౌంటింగ్ సిబ్బందిని అశ్చర్య పరుస్తున్నాయి.. మద్యానికి, బెట్టింగ్‌లకు బానిసగా మారిన తన భర్త బాగు పడాలని కోరుకుంటూ ఓ భక్తురాలు హుండీలో వేసిన చిట్టీ కౌంటింగ్ సిబ్బందిని షాక్ అయ్యేలా చేసింది. కౌంటింగ్‌లో ఇంకా ఎన్నో వింతలు కనిపిస్తున్నాయి. మొన్న అంబేడ్కర్ ఫోటో తో నకిలీ కరెన్సీ.. నిన్న భక్తురాలి బొట్టు.. నేడు తన భర్త బెట్టింగ్స్ మానాలని కోరుకుంటూ సమ్మక్క తల్లికి చీటీ ద్వారా భక్తురాలి విజ్ఞప్తి. ఇలా మేడారం హుండీలలో విచిత్రాలు కౌంటింగ్ సిబ్బందిని ఆశ్చర్య పరుస్తున్నాయి..
మద్యానికి, బెట్టింగ్ లకు బానిసగా మారిన భర్త ఉంటే ఆ భార్య జీవితం ఎంత నరకంగా ఉంటుందో చెప్పక్కర్లేదు.. చెడు అలవాట్లు మనెయ్యాలని ఇద్దరి మధ్య రోజు జరిగే గొడవ మామూలుగా ఉండదు. అయితే బెట్టింగ్ లకి అలవాటు పడి ఎంతగా తనను విసిగిస్తున్నాడో కానీ.. తన భర్త బెట్టింగ్ మానేలా చేయాలని చీటీలో రాసి సాక్షాత్తూ మేడారం అమ్మవార్ల హుండీలో వేసింది ఓ భక్తురాలు. అదేవిధంగా తన అక్క కొడుక్కి ఐఐటీలో సీట్ రావాలని అమ్మవారిని వేడుకుంటూ చీటీలో రాసింది మరో భక్తురాలు. మేడారం హుండీల లెక్కింపులో అంబేద్కర్ ఫోటోతో ఉన్న వంద రూపాయల కరెన్సీ నోట్లు వచ్చిన ఘటనా మరవక ముందే, ఓ భక్తురాలి వింత కోరికల చీటీలు అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది.
మరోవైపు హుండీల లెక్కింపులో నకిలి నోట్లు బయటపడుతున్నాయి. అంబేద్కర్ ఫోటోతో ఉన్న 100 రూపాయల నకిలీ నోట్లు హుండిలలో వేశారు కొందురు వ్యక్తులు. అంబేద్కర్ ఫోటోను కరెన్సీపై ముద్రించాలనేది వారి డిమాండ్…ఇప్పటివరకు ఆరు నకిలీ నోట్లు లభ్యమైయ్యాయి..
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…