Ayodhya Ram Mandir: కోట్లాది మంది హిందువుల కల రామయ్య మందిరం.. దాదాపు సగం పనులు పూర్తయ్యాయన్న సీఎం యోగి

|

Oct 07, 2022 | 12:35 PM

ఆగష్టు 5, 2020 న, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.. అప్పటి నుండి ఆలయ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 2023 నాటికి ఆలయ నిర్మాణం పూర్తవుతుందని, జనవరి 2024లో జరిగే మకర సంక్రాంతి పండుగ నాటికి..

Ayodhya Ram Mandir: కోట్లాది మంది హిందువుల కల రామయ్య మందిరం.. దాదాపు సగం పనులు పూర్తయ్యాయన్న సీఎం యోగి
Ayodhya Ram Mandir
Follow us on

కోట్లాది హిందువుల కల రామయ్య పుట్టిన నేల అయోధ్యలో రామ మందిర నిర్మాణం. వందల ఏళ్ల కల నిజం చేస్తూ.. అయోధ్యలో సరయు నది తీరం వద్ద రామ మందిర నిర్మాణం శర వేగంగా జరుగుతోంది. ఇదే విషయంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ .. రాజస్థాన్‌లోని శ్రీ పంచఖండ్ పీఠ్‌లో జరిగిన కార్యక్రమంలో స్పందించారు.  అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామమందిరానికి సంబంధించిన 50 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయని చెప్పారు.

రాజస్థాన్‌లోని శ్రీ పంచఖండ్ పీఠ్‌లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన సీఎం యోగీ అన్ని సామాజిక,  మతపరమైన ఉద్యమాలలో ‘శ్రీ పంచఖండ పీఠం’ ఎల్లప్పుడూ ప్రముఖ పాత్ర పోషిస్తుందని అన్నారు. “మహాత్మా రామచంద్ర వీర్ జీ మహరాజ్,  స్వామి ఆచార్య ధర్మేంద్ర జీ మహారాజ్ దేశానికి నిస్వార్థంగా కృషి చేశారని.. ప్రతి కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేయడానికి ఈ   పీఠం కీలక పాత్ర పోషించిందన్నారు. దేశ సంక్షేమం కోసం సాధువుల నేతృత్వంలో వివిధ ప్రచారాలను నిర్వహించిందని గుర్తు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

స్వామి సోమేంద్ర శర్మ  ‘చాదర్పోషి’ వేడుకలో, ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ఆచార్య ధర్మేంద్ర గోరక్షపీఠంతో మూడు తరాల నుండి మంచి అనుబంధాన్ని కలిగి ఉన్నారని చెప్పారు. “భారతదేశం సనాతన ధర్మం మన ‘గోమాత’ల (ఆవుల) రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది” అని అన్నారు.

ఆచార్య జీ  “1949లో ఉద్యమం ప్రారంభమైన రామమందిర కలను సాకారం చేయడానికి అంకితభావంతో కృషి చేశారు. ఫలితంగా, ఆచార్య జీ కలలుగన్న రామమందిరానికి సంబంధించిన 50 శాతానికి పైగా పనులు పూర్తి అయ్యాయని.. తెలిపారు. ఆచార్య తన అభిప్రాయాలను నిక్కచ్చిగా, హేతుబద్ధంగా చెప్పేవారని సీఎం అన్నారు. దీనివలన హిందూ సమాజం అతని పట్ల గౌరవం మరింత పెరిగిందని తెలిపారు. నేడు, ఆచార్య జీ భౌతికంగా లేకపోయినా, ఆయన విలువలు, ఆదర్శాలు, సహకారం మనందరిలో సజీవంగా ఉన్నాయని తెలిపారు.

రామాలయం ‘గర్భ గృహ’ లేదా ఆలయ గర్భగుడి నిర్మాణానికి ఈ ఏడాది జూన్‌లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శంకుస్థాపన చేశారు. అయోధ్యలో రాముడి ఆలయ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఆగష్టు 5, 2020 న, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.. అప్పటి నుండి ఆలయ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 2023 నాటికి ఆలయ నిర్మాణం పూర్తవుతుందని, జనవరి 2024లో జరిగే మకర సంక్రాంతి పండుగ నాటికి రాముడు విగ్రహం గర్భగుడిలో పూజలను అందుకోనున్నది. దాదాపు రూ.1,800 కోట్లు అంచనాతో రామ మందిర నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే.

భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్  నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నవంబర్ 9, 2019న అయోధ్యలో బాబ్రీ మసీదు ఉన్న భూమి శ్రీరాముడికి  చెందుతుందని ఏకగ్రీవంగా తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..