Silver Price Today ( 03-02-2021): ఒక్కరోజులోనే భారీగా తగ్గిన వెండి ధరలు .. ఈరోజు మార్కెట్ లో కేజీ ధర ఎంతో ఉందో తెలుసా..!
బడ్జెట్ అనంతరం ఓ రేంజ్ లో చేరుకున్న వెండి ధర బుధవారం తగ్గుముఖం పట్టింది. మంగళవారంతో పోలిస్తే కేజీ వెండి ధర భారీగా తగ్గింది. కేజీ వెండి..

Silver Price Today ( 03-02-2021): బడ్జెట్ అనంతరం ఓ రేంజ్ లో చేరుకున్న వెండి ధర బుధవారం తగ్గుముఖం పట్టింది. మంగళవారంతో పోలిస్తే కేజీ వెండి ధర భారీగా తగ్గింది. కేజీ వెండి రూ.8,200 మేర తగ్గింది. ఈరోజు కేజీ వెండి ధర రూ.71,000 ఉంది. ఇక తులం వెండి ధర ప్రస్తుతం రూ.710గా ఉంది.
వెండి 10 గ్రాముల ధర తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశంలోని ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్ లో 10 గ్రాముల వెండి ధర రూ. 710లుండగా.. ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన నగరమైన విజయవాడ, విశాఖలో కూడా రూ. 710లుండి. ఇక దేశ ఆర్ధిక రాజధాని ముంబై లో రూ . 710, చెన్నైలో రూ 753లు దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల వెండి ధర రూ. 710.
అయితే భారతదేశంలో వెండి ధరల పై ప్రభావం చూపించడానికి రకరకాల అంశాలు ఉన్నాయి. మనదేశంలో వెండి ధరలలో కదలికలు – అంతర్జాతీయ మార్కెట్లలోని మార్పులను ప్రభావం చూపుతాయి. ఇక దేశంలోని వడ్డీరేట్లతో పాటు, ద్రవ్యోల్బణ ధోరణులు వంటివి కూడా వేడిని ధరపై ప్రభావాన్ని చూపుతాయి.