Gold Price Today(03-02-2021): మహిళలకు గుడ్ న్యూస్ రోజు రోజుకీ దిగివస్తున్న బంగారం ధర.. ఈరోజు పసిడి ధర ఎంత ఉందో తెలుసా..!
బంగారు కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. ధరలు రోజురోజుకు దిగివస్తున్నాయి. పసిడి ప్రియులకు మరింత ఊరట కలిగిస్తున్నాయి. తాజాగా గోల్డ్ ధర భారీగా తగ్గింది. కరోనా సమయంలో ఓ రేంజ్ కి వెళ్లిన

Gold Price Today(03-02-2021): బంగారు కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. ధరలు రోజురోజుకు దిగివస్తున్నాయి. పసిడి ప్రియులకు మరింత ఊరట కలిగిస్తున్నాయి. తాజాగా గోల్డ్ ధర భారీగా తగ్గింది. కరోనా సమయంలో ఓ రేంజ్ కి వెళ్లిన బంగారం రోజు రోజుకీ దిగివస్తూ మహిళలకు ఆనందాన్ని కలిగిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో బుధవారం రోజున బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..!
తాజాగా హైదరాబాద్ లో నిన్నటి నుంచి ఈరోజుకి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 350 మేర తగ్గింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,150లకు చేరుకుంది. ఇక అదేసమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.380 తగ్గింది. దీంతో తాజగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,260లకు చేరుకుంది.
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,590గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,590గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,560 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,800గా ఉంది. . దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,300గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,600గా ఉంది.
అయితే ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారంలో హెచ్చుతగ్గులుండవచ్చని నిపుణులు తెలిపారు. కనుక వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వినియోగదారులు పసిడిని కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలిపారు.
Also Read: