Ram In Red: ‘రెడ్’ సినిమాను ఓటీటీలో విడుదల చేయమని ఎన్నో ఆఫర్లు వచ్చాయి.. కానీ ఆయన అలా చేయలేదు..
Red Pre-release Event: 'ఈస్మార్ట్ శంకర్'లాంటి భారీ విజయం తర్వాత రామ్ నటిస్తోన్న చిత్రం 'రెడ్'. ఇప్పటికే విడుదలైన చిత్ర ఫస్ట్‌లుక్, ట్రైలర్‌లతో పాటు ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్‌లో నటిస్తుండడంతో ఈ సినిమాపై..

Red Pre-release Event: ‘ఈస్మార్ట్ శంకర్’లాంటి భారీ విజయం తర్వాత రామ్ నటిస్తోన్న చిత్రం ‘రెడ్’. ఇప్పటికే విడుదలైన చిత్ర ఫస్ట్‌లుక్, ట్రైలర్‌లతో పాటు ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్‌లో నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. నిజానికి ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా చిత్ర విడుదల వాయిదా పడింది. తాజాగా థియేటర్లు తిరిగి ప్రారంభం కావడంతో ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఇవెంట్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా హీరో రామ్ చిత్ర విడుదలకు సంబంధించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకు నిజమైన హీరో మా పెదనాన్న (నిర్మాత రవికిషోర్). కరోనా సమయంలో రెడ్ సినిమాను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని ఆఫర్లు వచ్చాయి.. ఇంకా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే ఎన్ని కష్టాలు వచ్చినా ‘రెడ్’ సినిమాను థియేటర్‌లోనే విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. పెదనాన్న లేకపోతే ఈ సినిమా ఎప్పుడో ఓటీటీలో విడుదలయ్యేది, ఇప్పుడీ ప్రీరిలీజ్ ఇవెంట్ ఉండేది కాదు, ఈ కిక్ ఉండేది కాదు’ అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన త్రివిక్రమ్.. నిర్మాత రవికిషోర్ గురించి మాట్లాడుతూ.. ‘స్వయంవరం’ చిత్రం తర్వాత నాకు పెద్దగా అవకాశాలు రాలేవు దీంతో భీమవరం వెళ్లి క్రికెట్ ఆడుకుంటోన్న సమయంలో రవికిషోర్ గారు నన్ను పిలిపించి ‘నువ్వే కావాలి’ చిత్రానికి మాటలు రాయించారు. ఈ విషయంలో నేను ఆయనకు చాలా రుణపడి ఉన్నాను’ అంటూ గతాన్ని గుర్తుచేసుకున్నాడు. టాలీవుడ్‌కు అచ్చొచ్చే సంక్రాంతి బరిలో దిగుతోన్న రామ్.. ‘రెడ్’ చిత్రంతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.
Also Read: RED Movie Trailer : రామ్ ‘రెడ్’ ట్రైలర్ ఆగయా..’ఈసారి మంట మాములుగా లేదు’..మాస్, క్లాస్ మిక్స్