Also Read :
‘కలర్ ఫొటో’ టీమ్‌కు మాస్ రాజా ప్రత్యేక అభినందనలు
ఇటీవల నటుడు సుహాస్ ప్రధాన పాత్రలో నటించిన 'కలర్ ఫొటో' చిత్రం ఆహా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు మూవీ లవర్స్ నుంచే కాదు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి.

ఇటీవల నటుడు సుహాస్ ప్రధాన పాత్రలో నటించిన ‘కలర్ ఫొటో’ చిత్రం ఆహా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు మూవీ లవర్స్ నుంచే కాదు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి. పలువురు సెలబ్రిటీస్ కూడా చిత్ర బృందాన్ని ప్రైజ్ చేస్తున్నారు. సీనియర్ నటుడు జగపతిబాబు సినిమా అద్బతం అంటూ ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. తాజాగా ఇండస్ట్రీలో ఏ సపోర్ట్ లేకుండా ఎదుగుతున్నవాళ్లు ఆదర్శంగా భావించే మాస్ రాజా రవితేజ.. ‘కలర్ ఫొటో’ చిత్ర దర్శకుడు సందీప్ రాజ్, హీరో సుహాస్లను ఇంటికి ఆహ్వానించి అభినందించారు. ఓ రకంగా చెప్పాలంటే ‘కలర్ ఫొటో’ ఓటీటీ బ్లాక్‌బాస్టర్ అని చెప్పాలి. థియేటర్స్‌లో రిలీజ్ అయితే ఇంత మంచి సినిమాకు ప్రేక్షకులు కలెక్షన్ల రూపంలో తమ ఆదరణను చూపించేవారు.