Rakul Preet Singh : షూటింగ్ కు సైకిల్ పైన వెళ్లిన హీరోయిన్..12 కిలోమీట‌ర్లు సైక్లింగ్ చేసిన రకుల్

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్ నెస్ కు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అందరికి తెలిసిందే. ఈ అమ్మడు నిత్యం వర్కౌట్స్ చేస్తూ ఫిట్ గా...

Rakul Preet Singh : షూటింగ్ కు సైకిల్ పైన వెళ్లిన హీరోయిన్..12 కిలోమీట‌ర్లు సైక్లింగ్ చేసిన రకుల్
Follow us

|

Updated on: Jan 13, 2021 | 8:47 PM

Rakul Preet Singh : టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్ నెస్ కు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అందరికి తెలిసిందే. ఈ అమ్మడు నిత్యం వర్కౌట్స్ చేస్తూ ఫిట్ గా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రకుల్ ఎప్పుడు జిమ్ వీడియోలు వర్కౌట్స్ ఫోటోలు పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ 12 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ షూటింగ్ కు వెళ్ళింది.

సినిమా సెట్స్ కు జిమ్ వేర్ లో సైక్లింగ్ చేస్తూ వెళ్లింది. హైవేపై ర‌కుల్ సైక్లింగ్ చేస్తుంటే పక్కన కారులో ఒక వ్యక్తి వీడియో తీసాడు. ఆ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది రకుల్. ఈ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి ‘నేను ఏం చెప్ప‌డానికి ట్రైం చేస్తున్నానంటే.. టైం మేనేజ్ మెంట్ లో భాగంగా సెట్స్ కు 12 కిలోమీట‌ర్లు సైకిల్ తొక్కుతూ వెళ్లాను..’ అంటూ రాసుకొచ్చింది రకుల్. ప్రస్తుతం ఈ చిన్నది బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తుంది. అలాగే తమిళ్ లోను ఓ మూవీ చేస్తుంది రకుల్. తాజాగా రకుల్ సైకిల్ తొక్కుతూ సెట్స్ కు వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ravi Teja Khiladi : జోరు పెంచిన మాస్ మహారాజ్.. ‘ఖిలాడి’మూవీ టీజర్ కు డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్ .?

Esha Chawla : మరోసారి తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వనున్న ముద్దుగుమ్మ..రెండు సినిమాలతో రానున్న ఇషాచావ్లా…