కరోనా స్ప్రెడ్‌ అవుతుందనే ఎన్నికలు వద్దన్నాం.. సుప్రీం తీర్పు ఒకరి గెలుపో.. మరొకరి ఓటమో కాదన్న అబ్బయ్య చౌదరి

| Edited By: Sanjay Kasula

Jan 26, 2021 | 3:57 PM

ఏపీ పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం వైసీపీ నేతల్లో స్పష్టమైన మార్పు వచ్చినట్లు కనిపిస్తుంది. మొన్నటి వరకు..

కరోనా స్ప్రెడ్‌ అవుతుందనే ఎన్నికలు వద్దన్నాం.. సుప్రీం తీర్పు ఒకరి గెలుపో.. మరొకరి ఓటమో కాదన్న అబ్బయ్య చౌదరి
Follow us on

ఏపీ పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం వైసీపీ నేతల్లో స్పష్టమైన మార్పు వచ్చినట్లు కనిపిస్తుంది. మొన్నటి వరకు అటు ప్రతిపక్ష పార్టీ టీడీపీతోనే కాకుండా ఇటు ఎస్‌ఈసీతోనూ ఢీ అంటే ఢీ అన్న ఫంక పార్టీ నేతలు.. ఇప్పుడు ఎస్‌ఈసీ ఎలాగంటే అలాగే అంటూ తలూపుతుండటం ఆసక్తిగా మారింది.

పంచాయతీ ఎన్నికలు ఆపాలని హైకోర్టు సింగిల్‌ బెంచ్‌కు, అనంతరం డివిజన్‌ బెంచ్‌కు.. అటు నుంచి సుప్రీకోర్టు వరకు వెళ్లినా వైసీపీ ప్రభుత్వానికి ఉపశమనం లభించలేదు. కోర్టు మొట్టికాయలతో తలబొప్పికట్టిన ప్రభుత్వం.. ఎస్‌ఈసీకి సహకరిస్తామనే స్థాయికి వచ్చింది. కరోనా వ్యాపిస్తే ఆ నేరమంతా నిమ్మగడ్డ రమేష్‌దే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక సుప్రీం తీర్పును ఒకరి గెలుపుగానో… ఇంకొకరి ఓటమిగానో అనుకోవాల్సిన అవసరం లేదంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. కరోనా స్ప్రెడ్ అవుతుందనే ఎన్నికలు వాయిదా వేయాలని కోరామని తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పును స్టడీ చేసి… పీపుల్ హెల్త్‌ను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటామన్నారు దెందులూరు ఎమ్మెల్యే. ఎలక్షన్లు ఎప్పుడు జరిగినా తాము సిద్ధమని… భయపడే ఛాన్సే లేదంటున్నారు.