ఏపీలో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కెవరు?

రాష్ట్ర విభజన దెబ్బకు ఏపీలో కుదేలైన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మరో కొత్త కష్టం వచ్చిపడింది. ఇప్పుడు ఆ పార్టీకి అక్కడ సారథి లేకుండా పోయారు. పీసీసీ అధ్యక్షపదవికి రఘువీరారెడ్డి ఇటీవల రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాను ఆమోదించనప్పటికీ.. ఆయన స్థానంలో ఎవరిని నియమించాలన్నది అధిష్టానానికి అంతుపట్టడం లేదు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయానికి బాధ్యత వహిస్తూ ఆ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ తన పదవికి రాజీనామా చేశారు. […]

  • Updated On - 12:54 pm, Mon, 29 July 19 Edited By:
ఏపీలో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కెవరు?

రాష్ట్ర విభజన దెబ్బకు ఏపీలో కుదేలైన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మరో కొత్త కష్టం వచ్చిపడింది. ఇప్పుడు ఆ పార్టీకి అక్కడ సారథి లేకుండా పోయారు. పీసీసీ అధ్యక్షపదవికి రఘువీరారెడ్డి ఇటీవల రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాను ఆమోదించనప్పటికీ.. ఆయన స్థానంలో ఎవరిని నియమించాలన్నది అధిష్టానానికి అంతుపట్టడం లేదు.

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయానికి బాధ్యత వహిస్తూ ఆ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ తన పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత పలు రాష్ట్రాల పీసీసీలు కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో కొత్తవారిని నియమించినా.. ఏపీ విషయంలో అలాంటి కసరత్తే జరుగుతున్నట్లు కనిపించడం లేదు. పార్టీలో సీనియర్ నేతలు ఇప్పటికే ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆ పార్టీలో సీనియర్ నేతలుగా తులసి రెడ్డి, కనుమూరి బాపిరాజు, చింతా మోహన్ వంటివారు మిగిలారు. రాష్ట్రంలో ఇప్పుడు పార్టీ ఉన్న పరిస్థితుల్లో వారూ నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో పీసీసీ అధ్యక్ష పదవి కోసం అన్ని విధాల అర్హుడైన లీడర్‌ను అన్వేషిస్తున్నట్లు సమాచారం.